శనివారం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దేశవ్యాప్తంగా సోదాలు నిర్వహించింది. హైదరాబాద్ పాతబస్తీతో సహా నాలుగు చోట్ల ఎన్ఐఏ అధికారులు సోదాలు జరిపారు .  ఐఎస్ఐఎస్ సానుభూతిపరులుగా అనుమానిస్తున్న వారి నివాసాల్లో ఈ తనిఖీలు జరుగుతున్నట్లుగా సమాచారం.

శనివారం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దేశవ్యాప్తంగా సోదాలు నిర్వహించింది. హైదరాబాద్, చెన్నై, కోయంబత్తూరులలో దాడులు నిర్వహిస్తోంది. ఈ రోజు ఉదయం పాతబస్తీ సహా నాలుగు చోట్ల ఎన్ఐఏ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ రోజు ఉదయం హైదరాబాద్ పాతబస్తీతో సహా నాలుగు చోట్ల ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించడం కలకలం రేపింది. ఐఎస్ఐఎస్ సానుభూతిపరులుగా అనుమానిస్తున్న వారి నివాసాల్లో ఈ తనిఖీలు జరుగుతున్నట్లుగా సమాచారం. వివిధ సంస్థలుగా ఏర్పడి ఐఎస్‌లో పనిచేస్తున్నట్లు ఎన్ఐఏ గుర్తించింది. ఈ నేపథ్యంలోనే తమిళనాడులోని చెన్నైలోని పది ప్రాంతాల్లో కోయంబత్తూరులో 20 చోట్ల సోదాలు జరుగుతున్నట్లుగా కథనాలు వస్తున్నాయి. 

తమిళనాడు, హైదరాబాద్‌లో జరిగిన ఎన్ఐఏ సోదాలపై ప్రకటన చేసింది. కోయంబత్తూర్‌ పేలుళ్ల ఘటనపై సోదాలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపింది. అరబిక్ భాష పరిజ్ఞానం పేరుతో ఉగ్రవాద పాఠాలు చెబుతున్నట్లుగా సోదాల్లో తేలింది. వాట్సాప్, టెలీగ్రామ్‌తో ఐఎస్ఐఎస్‌ వైపు యువతను మళ్లిస్తున్నట్లుగా గుర్తించారు. దీనితో పాటు రూ.60 లక్షల విదేశీ నగదును స్వాధీనం చేసుకున్నారు. ఎలక్ట్రానిక్ పరికరాలతో పాటు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇంకా సోదాలు కొనసాగుతున్నట్లుగా తెలిపింది.