రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు: కేఆర్ఎంబీకి ఎన్జీటీ కీలక ఆదేశాలు

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై స్వంతంగా తనిఖీలు చేసి నివేదిక ఇవ్వాలని కేఆర్ఎంబీకి ఎన్జీటీ శుక్రవారం నాడు ఆదేశించింది. తనిఖీలకు ఏపీ ప్రభుత్వం సహకరించడం లేదని ఎన్జీటికి కేఆర్ఎంబీ తెలిపింది. కేఆర్ఎంబీ నివేదిక ఆధారంగా తదుపరి ఆదేశాలు ఇస్తామని ఎన్జీటీ ప్రకటించింది.

NGT orders to submit report after inspection Rayalaseema lift irrigation works lns


హైదరాబాద్: రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను స్వంతంగా తనిఖీ చేసి నివేదిక ఇవ్వాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కృష్ణా యాజమాన్య బోర్డును ఆదేశించింది.ఎన్జీటీ ఆదేశాలను ధిక్కరిస్తూ ఏపీ ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను కొనసాగిస్తున్న విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం ఎన్జీటీ దృష్టికి తీసుకొచ్చింది. ఈ విషయమై ఎన్జీటీ ఇవాళ విచారణ నిర్వహించింది. 

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు తనిఖీకి తమకు ఏపీ ప్రభుత్వం సహకరించడం లేదని  ఎన్జీటీకి  కేఆర్ఎంబీ తెలిపింది. ఈ ప్రాజెక్టు పనులును స్వయంగా పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.  కేఆర్ఎంబీ నివేదిక ఆధారంగా తదుపరి ఆదేశాలు ఇస్తామని ఎన్జీటీ తెలిపింది.ఈ పిటిషన్ పై విచారణను ఈ ఏడాది ఆగస్టు 9వ తేదీకి వాయిదా వేసింది.ఏపీ ప్రభుత్వం నిర్మిస్తోన్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుతో తెలంగాణ ఏడారిగా మారే అవకాశం ఉందని  తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.
ఈ ప్రాజెక్టు నిర్మాణంపై కేఆర్ఎంబీతో పాటు కేంద్ర జల్ శక్తి మంత్రికి తెలంగాణ ప్రభుత్వం పిర్యాదు చేసింది. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios