ఆదిలాబాద్ జిల్లాలో విషాద సంంఘటన చోటుచేసుకుంది. గురువారం పెళ్లి చేసుకున్న నవదంపతులు శుక్రవారం రాత్రి రిసెప్షన్‌కు వెళుతూ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. వారితో పాటు కారులో ప్రయాణిస్తున్న మరో నలుగురు కూడా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లాలో శుక్రవారం రాత్రి జరిగింది. 

ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. నిజామాబాద్‌ జిల్లాకు చెందిన ఆడెపల్లి సాయికుమార్‌తో ఆదిలాబాద్ జిల్లా మావల మండలం రాంనగర్‌ గ్రామానికి చెందిన ప్రియాంకకు గురువారం వివాహం జరిగింది. వీరి వివాహం ఆదిలాబాద్ అంగనంగ వైభవంగా జరిగింది. అయితే మరుసటి రోజు అంటే గురువారం వరుడి ఇంటివద్ద రిసెప్షన్ ఏర్పాటు చేశారు. 

దీంతో శుక్రవారం సాయంత్రం నవ దంపతులతో పాటు మరో నలుగురు ఓ కారులో ఆదిలాబాద్ నుండి నిజామాబాద్ కు బయలుదేరారు. ఈ క్రమంలో వీరు ప్రయాణిస్తున్న కారు జాతీయ రహదారిపై వెళుతుంగా దేవాపూర్‌ క్రాస్‌ రోడ్డు వద్ద ప్రమాదానికి గురయ్యింది. కారును వేగంగా వస్తున్న బస్సు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. 

దీంతో కారులో ప్రయాణిస్తున్న వదూవరులతో పాటు మిగతావారు కూడా తీవ్రంగా గాయాలపాలయ్యారు. వరుడు సాయికుమార్ ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నాడు. మిగతావారు కూడా తీవ్ర గాయాలతో రిమ్స్‌ ఆస్పత్నిలో చికిత్స పొందుతున్నారు.  

ఎన్నో కలలతో కొత్త జీవితాన్ని ప్రారంభించాలని పెళ్లి చేసుకున్న నవదంపుతులు ఇలా రోడ్డు ప్రమాదానికి గురవడంతో పెళ్లింట విషాదం నెలకొంది. వారి కోసం ఎంతో ఘనంగా ఏర్పాటు చేసిన రిసెప్షన్ కూడా ఆగిపోయింది.