తెలుగు నాట సంచలనం కలిగించిన వనస్థలిపురం గ్యాంగ్ వార్‌లో సరికొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా వనస్థలిపురం పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలోనే గాంజాయి అడ్డా ఉన్నట్లు గుర్తించారు.

గంజాయి మత్తులో యువకుల వీరంగం సృష్టించారు. ఆ మత్తులో రోజు గొడవలు ,ఘర్షణలకు దిగడంతో పాటు అటుగా వచ్చే యువతులు, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు యువకులు.

వీరి వీరంగంతో భయాందోళనకు గురవుతున్నారు వనస్థలిపురం కాంప్లెక్స్ వాసులు. పోకిరిల ఆగడాలపై పోలీసులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు.

ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే..  గతంలో వివిధ సందర్భాల్లో పట్టుబడ్డ గంజాయి తాలూకు కేంద్రాలను వనస్థలిపురంలో గుర్తించారు ఎక్సైజ్ అధికారులు. అయినప్పటికీ వనస్థలిపురం పోలీసులు పూర్తి స్థాయి నిఘా పెట్టలేదనే ఆరోపణలు వస్తున్నాయి.

దీంతో వనస్థలిపురానికి విచ్చలవిడిగా గంజాయి సప్లై అవుతుంది. ఈ గంజాయి ఎక్కడి నుండి వస్తుందన్న దానిపై నిఘా పెట్టాలని వనస్థలిపురం పోలీసులకు ఎక్సైజ్ అధికారులు సూచించారు.