హైదరాబాద్: దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన కాగజ్ నగర్ ఫారెస్ట్ అధికారులపై దాడి కేసులో సరికొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. ఫారెస్ట్ అధికారులపై దాడికి స్థానిక నేత ఉసిగొల్పడమే ప్రధాన కారణమని పోలీసులు నిర్ధారించారు. 

పోలీసుల విచారణలో దాడికి ఉసిగొల్పిన వారు ఎవరనేది కూడా నిర్ధారణ అయ్యింది. కబ్జా చేసిన అటవీ భూములను రక్షించుకునేందుకే గ్రామస్థులను ఉసిగొల్పి అధికారులపై దాడులకు తెగబడేలా చేశారని పోలీసులు నిర్ధారించారు. 

ఫారెస్ట్ అధికారులపై దాడులో కీలక వ్యక్తిగా బొర్రం  పోచం అని పోలీసులు గుర్తించారు. బొర్రం పోచం సుమారు 50 ఎకరాల అటవీ భూమిని కబ్జా చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. తన భూమిని కాపాడుకునేందుకే బొర్రం పోచం గ్రామస్థులను దాడికి ఉసిగొల్పినట్లు తేలింది. 

ఇకపోతే బొర్రం పోచం పలువురు రాజకీయ నేతలకు బినామీగా ఉన్నారని తెలుస్తోంది. రాజీకయ నేతలు కబ్జా చేసిన భూములకు బినామీగా బొర్రం పోచం వ్యవహరిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.