తెలంగాణలో కొత్త ట్రాఫిక్‌ రూల్స్‌: డ్రైవింగ్‌లో ఓవర్‌ యాక్షన్‌ చేస్తే ఇక వాచిపోద్ది

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టాలతో పాటు నూతన రహదారి భద్రతా నిబంధనలు కూడా ఈ నెలలో అమలులోకి వచ్చాయి. ఈ చట్టాల ప్రకారం రోడ్డు ప్రమాదాలకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

New traffic rules in Telangana GVR

తెలంగాణలో కొత్త ట్రాఫిక్‌ రూల్స్‌: బండి నడిపేటప్పుడు ఓవర్‌ యాక్షన్‌ చేస్తే ఇక వాచిపోద్ది

తెలంగాణలో ట్రాఫిక్‌ నిబంధనలు మరింత కఠినతరం అయ్యాయి. ట్రాఫిక్ రూల్స్‌ బ్రేక్‌ చేసి.. ఇష్టమొచ్చినట్లు వాహనం నడుపుతామంటే ఇక కుదరదు. రూల్స్‌ అతిక్రమించి రోడ్లపై వాహనాలు నడిపోతే ఇక నుంచి జేబుకు పెద్ద కన్నం పడుతుంది. అతిగా రూల్స్ అతిక్రమిస్తే జైలుపాలు కూడా అయ్యే పరిస్థితి రావొచ్చు. లేదా లైసెన్స్‌ రద్దు కావొచ్చు.  

అతివేగం, నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతూ.. ప్రమాదాలకు కారణమయ్యే వారి పీచమణిచేందుకు హైదరాబాద్‌ పోలీసులు సిద్ధమయ్యారు. ఈ జూలై ప్రారంభం నుంచి కొత్త రూల్స్‌ అమలులోకి తెచ్చారు. ఇప్పటికే ట్రాఫిక్‌ రూల్స్‌ ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధిస్తుండగా.. ఇక నుంచి భారీగా ఫైన్స్‌ వేసేందుకు సిద్ధమయ్యారు. అలాగే, జరిమానాలతో దారికి రాని వాహనదారుల ఆటకట్టించేందుకు కూడా చర్యలు తీసుకున్నారు. ట్రాఫిక్ రూల్స్‌ అతిక్రమించి తరచూ పట్టుబడే వారికి జైలు శిక్ష వేయడంతో పాటు లైసెన్సులు రద్దు చేయనున్నారు. పెంచిన జరిమానా, ఇతర వివరాలిలా ఉన్నాయి. 

కొత్త ట్రాఫిక్ రూల్స్ ఇవే... 
సాధారణ నేరం
    - మునుపటి జరిమానా: రూ.100
    - ప్రస్తుత జరిమానా: రూ.500

రెడ్ లైట్ ఉల్లంఘన 
    - మునుపటి జరిమానా: రూ.100
    - ప్రస్తుత జరిమానా: రూ.500

 అథారిటీ ఆదేశాలను ధిక్కరించడం
    - మునుపటి జరిమానా: రూ.500
    - ప్రస్తుత జరిమానా: రూ.2,000

 లైసెన్స్ లేకుండా డ్రైవింగ్
    - మునుపటి జరిమానా: రూ.500
    - ప్రస్తుత జరిమానా: రూ.5,000

అతివేగం
    - మునుపటి జరిమానా: రూ.400
    - ప్రస్తుత జరిమానా: రూ.1000

 ప్రమాదకరమైన డ్రైవింగ్
    - మునుపటి జరిమానా: రూ.1000
    - ప్రస్తుత జరిమానా: రూ.5,000

డ్రంక్ అండ్ డ్రైవ్..
    - మునుపటి జరిమానా: రూ.2000
    - ప్రస్తుత జరిమానా: రూ.10,000

రేసింగ్, స్పీడింగ్
    - మునుపటి జరిమానా: రూ.500
    - ప్రస్తుత జరిమానా: రూ.5,000

హెల్మెట్ ధరించకపోవడం
    - మునుపటి జరిమానా: రూ.100 
    - ప్రస్తుత జరిమానా: రూ.1000 + మూడు నెలలకు లైసెన్స్ రద్దు

సీట్‌బెల్ట్ ధరించకపోవడం
     - మునుపటి జరిమానా: రూ.100
     - ప్రస్తుత జరిమానా: రూ.1000

 అత్యవసర వాహనాలను అడ్డుకుంటే..
     - మునుపటి జరిమానా: నిర్దిష్ట జరిమానా లేదు
     - ప్రస్తుత జరిమానా: రూ.10,000

బైక్‌పై ట్రిపుల్ రైడింగ్
     - ప్రస్తుత జరిమానా: రూ.1,200

ద్విచక్ర వాహనాలపై ఓవర్‌లోడ్
     - మునుపటి జరిమానా: రూ.100
     - ప్రస్తుత జరిమానా: రూ.2,000 + మూడు నెలలకు లైసెన్స్ రద్దు.

ఇన్సూరెన్స్‌ లేకుండా డ్రైవింగ్
     - మునుపటి జరిమానా: రూ.1,000
     - ప్రస్తుత జరిమానా: రూ.2,000

కాగా, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టాలతో పాటు నూతన రహదారి భద్రతా నిబంధనలు కూడా ఈ నెలలో అమలులోకి వచ్చాయి. ఈ చట్టాల ప్రకారం రోడ్డు ప్రమాదాలకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. గతంలోనే మైనర్లు వాహనాలు నడిపి యాక్సిడెంట్లు చేస్తే పెద్దవారికి శిక్షలు పడేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. కొత్త చట్టాల ప్రకారం... ఇప్పుడు మైనర్లు వాహనం నడుపుతూ పట్టుబడితే.. ఏకంగా రూ.25 వేల రూపాయలు జరిమానా విధిస్తారు. దాంతో పాటు 25 ఏళ్ల వయసు వచ్చే వరకు లైసెన్స్ పొందే అవకాశం లేకుండా ఆంక్షలు విధించనున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios