Asianet News TeluguAsianet News Telugu

కరోనా రోగులెందరు, మరణాలెన్ని?: టీ సర్కార్‌ తీరుపై ట్విట్టర్‌లో నెటిజన్ల ప్రశ్నల వర్షం, ట్రెండింగ్

తెలంగాణ ప్రభుత్వం కరోనా విషయంలో అవలంభిస్తున్న విధానాలపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విట్టర్లు కేటీఆర్ స్టాప్ ఫేకింగ్ స్టార్ట్ వర్కింగ్ అనే హ్యాష్ ట్యాగ్ శుక్రవారంనాడు ట్రెండింగ్ అయింది. 

netizens questioned Telangana government about Corona cases and deaths lns
Author
Hyderabad, First Published Apr 23, 2021, 11:46 AM IST

తెలంగాణ ప్రభుత్వం కరోనా విషయంలో అవలంభిస్తున్న విధానాలపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విట్టర్లు కేటీఆర్ స్టాప్ ఫేకింగ్ స్టార్ట్ వర్కింగ్ అనే హ్యాష్ ట్యాగ్ శుక్రవారంనాడు ట్రెండింగ్ అయింది. తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. 

 

సీఎం రిలీఫ్ ఫండ్ నుండి నిధులను ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు అందించాలని  ప్రేమ అనే మహిళ కోరారు. 

 

మరోవైపు లిఖిత్ గౌడ్ అనే నెటిజన్ కేటీఆర్ కు ప్రశ్నల వర్షం కురిపించారు. వ్యాక్సిన్ ప్రమోషన్ ఎవరు చేస్తున్నారు కేటీఆర్ లేదా కేసీఆర్ అని ప్రశ్నించారు. కోవిడ్ కు సంబంధించి మందులు, ఆసుపత్రుల్లో బెడ్స్ బ్లాక్ మార్కెటింగ్ అవుతున్నాయని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో కరోనా రోగులు, మరణాల నిజమైన సంఖ్య తెలపాలని ఆయన కోరారు. కరోనాపై సీఎం ఎప్పడు సమీక్ష నిర్వహించారని ఆయన ప్రశ్నించారు.

 

 

తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టాలని నరేష్ అనే నెటిజన్ కేంద్రాన్ని కోరాడు. రాష్ట్రానికి కేంద్రం నుండి మెడికల్ స్టాఫ్ ను పంపాలని కోరారు. రాష్ట్రంలోని కరోనా రోగులకు సేవలు అందించాలని కోరారు. తెలంగాణలో రాజకీయ అనుభవం లేని నేతలతో ప్రజల ప్రాణాలను ఇబ్బందుల్లో పెట్టలేమని ఆయన అభిప్రాయపడ్డారు.

రాష్ట్రాలకు , కేంద్రానికి కరోనా వ్యాక్సిన్  ధరల్లో తేడాలపై మంత్రి కేటీఆర్ గురువారం నాడు ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. 
 

Follow Us:
Download App:
  • android
  • ios