తెలంగాణ మంత్రి కేటీఆర్ రాజకీయాల్లో ఎంత చురుకుగా వ్యవహరిస్తారో... సోషల్ మీడియాలోనూ అంతే యాక్టివ్ గా ఉంటారు. అలా అని ఆయన సోషల్ మీడియాని టైం పాస్ కోసం వినియోగించరు. ప్రజల క్షేమం గురించి , వారు పడుతున్న సమస్యల గురించి తెలుసుకోవాడిని వినియోగిస్తున్నారు.

ట్విట్టర్ వేదికగా ఆయన ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కరించిన సందర్భాలు  చాలానే ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం లాక్ డౌన్ కారణంగా ఐదు నెలల చిన్నారి ఆహారం లేక ఇబ్బంది పడుతుంటే.. కేవలం ఒక్క ట్వీట్ తో కేటీఆర్ స్పందించారు. వెంటనే ఆ చిన్నారి ఇంటికి ఆహారం కూడా పంపించి.. ఆకలి తీర్చారు. ఇలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి. అందుకే ఆయనకు రోజు రోజుకీ అభిమానులు పెరిగిపోతున్నారు.

చివరకు ఒకనాడు ఆయనను ద్వేషించిన వారు కూడా.. మేమిప్పుడు మీ అభిమానులం అని చెప్పుకునే స్థాయికి ఆయన ఎదిగారు. అందుకు ఓ నెటిజన్ చేసిన ట్వీట్ ఉదాహరణ. తాజాగా.. ఓ నెటిజన్ కేటీఆర్ ని ఉద్దేశించిన ఓ ట్వీట్ చేయగా.. అది ప్రస్తుతం వైరల్ గా మారింది.

ఆ ట్వీట్ తో కేటీఆర్ అభిమానులు, టీఆర్ఎస్ కార్యకర్తలు ఫుల్ ఖుషీ అయ్యారు. ఇంతకీ ఆ నెటిజన్ ఏమని ట్వీట్ చేశాడంటే..

‘‘నేను తెలంగాణకు చెందినవాడిని కాదు. తొలుత మిమ్మల్నీ, మీ నాన్నని ద్వేషించాను. ఇప్పుడు మీ పాలన చూసి అభిమానిగా మారిపోయాను. తెలంగాణకే కాదు.. దేశం మొత్తం మీ న్యాయకత్వాన్ని పొందుతుందని ఆశిస్తున్నాను’’ అంటూ ఓ నెటిజన్ కేటీఆర్ ని ఉద్దేశించి ట్వీట్ చేశాడు.

కాగా... ఆ నెటిజన్ ట్వీట్ కి కేటీఆర్ స్పందించిన తీరు మరింత ఆకట్టుకుంటోంది. ‘‘మీలో వచ్చిన పరివర్తనకు అభినందనలు. మీ హృదయంలో ద్వేషం స్థానంలో అభిమానం చోటుచేసుకోవడం చాలా ఆనందంగా ఉంది.’’ అంటూ కేటీఆర్ రిప్లై ఇచ్చారు. ఇప్పుడు వీరి సంభాషణ ట్విట్టర్ లో హైలెట్ గా నిలిచింది.