ఈటలపై సొంత పార్టీ నేత ఫైర్.. ‘బీజేపీని హోల్‌సేల్‌గా అమ్మాలని చూస్తున్నారు’
ఈటల రాజేందర్ పై సొంత పార్టీ నేత ఫైర్ అయ్యారు. నర్సాపూర్ టికెట్ దక్కని అసమ్మతి నేత గోపి ఈ రోజు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో ఈటలపై నిప్పులు చెరిగారు. ఆయన పార్టీలోకి వచ్చినప్పటి నుంచే ఆధిపత్య పోరు పెరిగిందని అన్నారు. ఆయన అనుచరులకే టికెట్లు వచ్చేలా మ్యానిపులేట్ చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ ఎవరి జాగిరీ కాదని పేర్కొన్నారు.
హైదరాబాద్: తెలంగాణ బీజేపీలో అసమ్మతి పతాకస్థాయికి చేరుకుంటున్నది. హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పై సొంత పార్టీ నేత ఫైర్ అయ్యారు. నర్సాపూర్ అసమ్మతి నేత గోపి ఈ రోజు నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిప్పులు చెరిగారు. పార్టీని హోల్‌సేల్‌గా అమ్మాలని చూస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ ఎవరి జాగిరీ కాదని ఫైర్ అయ్యారు.
ఈటల రాజేందర్ పార్టీలో చేరినప్పటి నుంచి ఆధిపత్య పోరు పెరిగిందని, కష్టపడి పని చేసిన వారికి గుర్తింపు లేదని గోపి అన్నారు. కష్టపడి పార్టీ కోసం పని చేసే వారిని పార్టీ జాతీయ నాయకత్వమే కాపాడుకోవాలని కోరారు. ఈటల రాజేందర్ తన అనుచరులకు టికెట్లు వచ్చేలా మానిపులేట్ చేస్తున్నారని ఆరోపించారు. పార్టీలో 30 నుంచి 40 మందిని చేర్చుకుంటామని వట్టి మాటలను ఈటల రాజేందర్ జాతీయ నాయకత్వానికి చెప్పాడని పేర్కొన్నారు. అలాంటి మాటలను జాతీయ నాయకులు నమ్ముతున్నదని ఆగ్రహించారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈటల రాజేందర తన అనుచరులకు టికెట్లు ఇప్పిస్తానని హామీ ఇచ్చాడని, దాని ప్రకారమే మ్యానిపులేట్ చేసుకుంటూ టికెట్లు ఇప్పిచ్చుకుంటున్నాడని గోపీ ఆరోపణలు చేశారు. అసలు తమకు టికెట్ ఎందుకు ఇవ్వలేదో జాతీయ నాయకులు సమాధానం చెప్పాలని నిలదీశారు. ఇంత చేసిన వీళ్లూ డిసెంబర్ 3 తర్వాత పార్టీలో కొనసాగుతారా? అని అనుమానం వ్యక్తం చేశారు. పార్టీ మారాలంటే తమకూ రెండు నిమిషాలు పట్టదని, కానీ, తాము ఆ పని చేయబోమని స్పష్టం చేశారు. ఈటల రాజేందర్ పార్టీ బాగుకోసం పని చేయడం లేదని ఆరోపించారు. ఆయన పార్టీని బొంద పెడతాడని పేర్కొన్నారు.
Also Read: ఇద్దరు ఎమ్మెల్యేల ఇళ్లు, ఒక మాజీ మంత్రి ఇంటికి నిప్పు.. మహారాష్ట్రలో ‘మరాఠా’ ఉద్యమం తీవ్రతరం
నర్సాపూర్ టికెట్ ప్రకటించి పది రోజులు దాటిందని, అయినా.. సెగ్మెంట్‌లో కనీసం ప్రచారం కూడా మొదలు పెట్టలేదని గోపీ అన్నారు. ఇదేంటని అడిగితే.. అందాల్సినవి ఇంకా రాలేదని చెబుతున్నారని తెలిపారు. ఇంతకూ ఈ అందాల్సినవి ఏమిటో చెప్పాలని ఆయన అడిగతారు.