తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు టీటీడీపీ నేత నామా నాగేశ్వరరావు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా మహాకూటమి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నో త్యాగాలు, బలిదానాలతో తెలంగాణ ఏర్పడిందని.. కానీ ప్రజలు కన్న కలలు ఒక్కటి నెరవేరలేదన్నారు.

నాలుగున్నరేళ్ల నుంచి ప్రభుత్వాన్ని విమర్శించాలంటే ప్రజలు భయపడిపోతున్నారని నాగేశ్వరరావు ఆరోపించారు. కాంగ్రెస్, టీడీపీలు రాష్ట్రాన్ని ఎంతగానో అభివృద్ధి చేశాయని.. అందువల్లే తెలంగాణ ధనిక రాష్ట్రంగా అవతరించిందన్నారు.
తెలంగాణలో ప్రాజెక్టులను చంద్రబాబు అడ్డుకుంటున్నారని టీఆర్ఎస్ నేతలు మాయమాటలు చెబుతున్నారని నామా అన్నారు. హైదరాబాద్‌కు అంతర్జాతీయ విమానాశ్రయం తెచ్చినందుకు చంద్రబాబును అడ్డుకోవాలా..? ఐటీ తీసుకొచ్చినందుకు అడ్డుకోవాలా..? ఔటర్ రింగ్ రోడ్‌ను తెచ్చినందుకు అడ్డుకోవాలా..? ఎందుకు అడ్డుకోవాలని నామా టీఆర్ఎస్‌ను ప్రశ్నించారు.
ప్రజా స్వామ్యం ఖూనీ అవుతుంటే రాహుల్-చంద్రబాబు ఏకమయ్యారని నామా అన్నారు. విభజన చట్టంలో పేర్కొన్న బయ్యారం స్టీల్ ప్లాంట్, ఖాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఎందుకు తీసుకురాలేదని నాగేశ్వరరావు డిమాండ్ చేశారు.