నల్గొండ: నల్గొండ జిల్లాలో పర్యటిస్తున్న 14 మంది విదేశీయులను పోలీసులు శుక్రవారం నాడు తమ ఆధీనంలోకి తీసుకొన్నారు. వీరందరిని సికింద్రాబాద్ ఐసోలేషన్ వార్డుకు తరలించారు.

విదేశాల నుండి వచ్చిన 14 మంది నల్గొండ జిల్లాలో పర్యటిస్తున్న విషయాన్ని స్థానికులు పోలీసుల దృష్టికి తీసుకొచ్చారు. ఈ 14 మంది విదేశీయులను పోలీసులు తమ అదుపులోకి తీసుకొన్నారు. 

14 మందిని పోలీసులు ప్రత్యేకమైన వాహనంలో సికింద్రాబాద్ ఐసోలేషన్ వార్డుకు తరలించారు. వియత్నాం నుండి 14 మంది నల్గొండ  జిల్లాకు వచ్చిన వారిని గుర్తించామని వైద్య ఆరోగ్య శాఖాధికారులు ప్రకటించారు.

వియత్నాం నుండి వచ్చిన 14 మంది టీమ్ జిల్లాలోని ఎక్కడెక్కడ తిరిగారు, ఎవరెవరితో సంబంధాలు పెట్టుకొన్నారనే విషయమై కూడ జిల్లా యంత్రాంగం ఆరా తీశారు. ఈ టీమ్ సభ్యులకు ప్రాథమిక పరీక్షలు నిర్వహించి సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇండోనేషియా నుండి వచ్చిన వారిలో ఏడుగురికి కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్నట్టుగా గుర్తించారు.