వరంగల్: ములుగు జిల్లా మంగపేటలో రోడ్డు సౌకర్యం లేకపోవడంతో నాగయ్య అనే వ్యక్తి మృతి చెందాడు. వారం రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా మంగపేటకు వెళ్లే అప్రోచ్ రోడ్డు కొట్టుకుపోయింది.

నాగయ్య అనే వ్యక్తి వారం రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నాడు. ఆర్ఎంపీ డాక్టర్లు కూడ చేతులేత్తేశారు.చికిత్స కోసం గ్రామం దాటాల్సిన పరిస్థితులు నెలకొన్నాయిరోడ్డు సౌకర్యం లేని కారణంగా 108 కూడ అక్కడకు చేరుకోలేకపోయింది. 

ఈ తరుణంలో నలుగురు యువకులు ప్రాణాలకు తెగించి వాగులో నాగయ్యను తమ చేతులపై ఎత్తుకొని వాగును దాటారు.ఆసుపత్రికి తరలిస్తుండగానే నాగయ్య మృతి చెందాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది.