నాక్ అక్రిడేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీకి చుక్కెదురైంది. దరఖాస్తు సమయంలో కాలేజీ యాజమాన్యం ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టినట్లుగా నాక్ గుర్తించింది.

బెల్, యాష్ టెక్నాలజీ, ఎయిర్‌టెల్‌లకు చెందిన ఫ్యాబ్రికేటెడ్ లెటర్ హెడ్స్, సంతకాలు పెట్టారని నాక్ కౌన్సిల్ తేల్చింది. గతేడాది డిసెంబర్‌లో మల్లారెడ్డి కాలేజీ దరఖాస్తు చేసుకుంది.

ఈ పరిణామాల నేపథ్యంలో మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ దరఖాస్తును నాక్ తిరస్కరించింది. దీంతో పాటు ఐదేళ్ల పాటు నాక్ అక్రిడేషన్ కోసం దరఖాస్తు చేసుకోకుండా బ్లాక్ లిస్ట్‌లో పెట్టింది.