హైదరాబాద్: రెండు రోజులుగా ఐటీ దాడులు జరుగుతున్నాయంటూ మీడియాలో వస్తున్న వార్తలపై జూపల్లి రామేశ్వర్ రావుకు చెందిన మై హోమ్‌ గ్రూప్ స్పందించింది. బెంగళూరుకి చెందిన ఓ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీపై జరిగిన ఐటీ దాడుల్లో భాగంగానే మై హోమ్‌ సంస్థల్లోనూ ఐటీ అధికారులు విచారణ చేపట్టారని ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. 

హైదరాబాద్‌లో బెంగళూరుకి చెందిన రియల్‌ ఎస్టేట్‌ సంస్థతో జాయింట్‌ వెంచర్‌ ఉండడం వల్లనే ఈ విచారణ జరిగినట్లు తెలిపింది.
ఐటీ అధికారులు కోరిన పూర్తి సమాచారాన్ని అందించినట్లు ప్రకటించింది. మై హోమ్‌ గ్రూప్‌ వ్యాపార కార్యకలాపాలన్నీ విలువలతో కూడి సాగుతాయని స్పష్టం చేసింది. 

కార్పొరేట్‌ గవర్నెన్స్‌ నియమనిబంధనలన్నీ పూర్తి స్థాయిలో పాటిస్తామని ప్రకటించింది. పన్ను చట్టాలను, నియంత్రణా సంస్థల నిబంధనలను పాటించడంలో తమకు మంచి ట్రాక్‌ రికార్డ్‌ ఉందని మై హోమ్‌ గ్రూప్ స్పష్టం చేసింది.