హైదరాబాద్‌లో మరో దారుణహత్య జరిగింది. అమీర్‌పేట్‌ ఎల్లారెడ్డిగూడలో కృష్ణ అనే వ్యక్తిని గుర్తుతెలియని దుండగులు గొంతుకోసి దారుణంగా హతమార్చారు. అర్థరాత్రి హత్య జరిగి వుండవచ్చిన పోలీసులు భావిస్తున్నారు.

నిందితుడు పాత నేరస్థుడు కావడంతో.. గతంలో జరిగిన వివాదాల కారణంగా హతమార్చి ఉంటారని భావిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని.. క్లూస్ టీం సాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌పోర్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.