హైదరాబాద్ పాతబస్తీలో దారుణం జరిగింది. ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ జరిగి అది హత్యకు దారి తీసింది. వివరాల్లోకి వెళితే.. పాతబస్తీలోనీ కాలాపత్తర్ రంజన్ కాలనీకి చెందిన మోసిన్, మహ్మద్ అమేర్ స్నేహితులు.

నిన్న రాత్రి ఇద్దరు కలిసి ఓ చోట కూర్చొని పీకల దాకా మద్యం తాగారు. మద్యం మత్తులో, మరింత మద్యం కోసం ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఆగ్రహంతో ఊగిపోయిన అమేర్ తన వద్ద ఉన్న కత్తితో మోసిన్‌పై విచక్షణారహితంగా దాడి చేశాడు.

ఇది గమనించిన స్థానికులు మోసిన్‌ను ఉస్మానియాకు తరలిస్తుండగా.. మార్గమధ్యంలోనే మరణించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఆధారాలు సేకరించారు. నిందితుడు మహ్మద్ అమేర్‌ను అదుపులోకి తీసుకున్నారు.