తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించడంపై ఇటీవలే ఆ పార్టీని వీడిన ఎంపి విశ్వేశ్వర్ రెడ్డి స్పందించారు. తన సారథ్యంలోని పార్టీని గెుపించుకున్న కేసీఆర్ అభినందనలు తెలిపారు. అదే తాండూర్ లో మంత్రి మహేందర్ రెడ్డి ఓటమి పట్ల విశ్వేశ్వర్ రెడ్డి పరోక్షంగా స్పందించారు.
తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించడం పట్ల ఇటీవలే ఆ పార్టీని వీడిన ఎంపి విశ్వేశ్వర్ రెడ్డి స్పందించారు. తన సారథ్యంలోని పార్టీని గెపించుకున్న కేసీఆర్ అభినందనలు తెలిపారు. అదే తాండూర్ లో మంత్రి మహేందర్ రెడ్డి ఓటమి పట్ల విశ్వేశ్వర్ రెడ్డి పరోక్షంగా స్పందించారు.
తాను ఎందుకోసమైతే పార్టీ నుండి బయటకు వచ్చానో ఆ లక్ష్యం నేరవేరిందని అన్నారు. ఓ 33 ఏళ్ల యువకుడు ఫైలట్ రోహిత్ రెడ్డి అపార రాజకీయ అనుభవం కలిగిన మంత్రిని ఓడించడం చాలా గొప్ప విషయమని పేర్కొన్నారు. తాండూరులో రోహిత్ రెడ్డి గెలుపు తనకెంతో ఆనందాన్నిచ్చిందని విశ్వేశ్వర్ రెడ్డి వెల్లడించారు.
తెలంగాణ ఎన్నికలకు ముందు విశ్వేశ్వర్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీని వీడుతూ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఆయన పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కు పంపిచిన రాజీనామా లేఖలో కూడా మంత్రిని మహేందర్ రెడ్డి ని పరోక్షంగా విమర్శించారు. కొందరు తెలంగాణ ద్రోహులు పార్టీలో చేరడం వల్ల తనలాంటి తెలంగాణ వాదులు ఇక్కడ ఇమడలేకపోతున్నారంటూ విశ్వేశ్వర్ రెడ్డి తన లేఖలో పేర్కొన్నారు.
ఇలా టీఆర్ఎస్ ను వీడిన ఆయన ఆ వెంటనే ఏఐసిసి అధ్యక్షులు రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం తాండూర్ లో తన అనుచరుడు ఫైలట్ రోహిత్ రెడ్డి గెలుపు కోసం పనిచేశారు. ఈ సందర్భంగా నిన్న వెలువడిన ఫలితాల్లో రోహిత్ రెడ్డి గెలవడంతో విశ్వేశ్వర్ రెడ్డి స్పందించారు.
వీడియో
"
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Dec 12, 2018, 4:49 PM IST