మజ్లిస్ పక్ష నేత, చంద్రాయణ గుట్ట శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీ అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఆయన ఆరోగ్యం విషమించడంతో చికిత్స నిమిత్తం ఆయనను హుటాహుటిన లండన్ కూడా తరలించారు. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థనలు చేయాలని అసదుద్దీన్ కోరారు కూడా. కాగా... ఈ ఘటనపై ఎంపీ రేవంత్ రెడ్డి స్పందించారు.

అక్బరుద్దీన్ గురించి కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. ఓవైసీ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని ఆయన తెలిపారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై తన గొంతుక వినిపించాలని ఆశిస్తున్నానని రేవంత్ ట్వీట్‌లో పేర్కొన్నారు.