టీఆర్ఎస్‌పై మండిపడ్డారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి. టీఆర్ఎస్ అంటే టోటల్ రివర్స్ స్టాండ్ పార్టీ అంటూ ఎద్దేవా చేశారు. ఐటీఐఆర్‌కు ప్రభుత్వం నుంచి కనీసం డీపీఆర్ కూడా పంపలేదని ఆయన ఆరోపించారు.

ఐటీఐఆర్ వద్దని కేటీఆర్ అన్నారని.. తెలంగాణ ప్రభుత్వం చేసిన తప్పుని సరిదిద్దుకోవాలని చూస్తోందంటూ రేవంత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రణాళికే లేకుండా ఏదో ఒకటి ఇవ్వాలంటే  కేంద్రం ఏమిస్తుందని ఆయన ప్రశ్నించారు.

లాభం వచ్చేది కాదు  కాబట్టే.. ఐటీఐఆర్ గురించి కేటీఆర్ పట్టించుకోవడం లేదని రేవంత్ దుయ్యబట్టారు. దేశంలో బీజేపీ గ్రాఫ్ వేగంగా పడిపోతోందని.. ఢిల్లీ రైతుల ఆందోళనతోనే మోడీ పతనం మొదలైందని ఆయన ఎద్దేవా చేశారు.