Asianet News TeluguAsianet News Telugu

ఆ 3 పార్టీలు కలిసి చంద్రబాబును చంపే కుట్ర.. ఏదైనా జరిగితే జగన్‌దే బాధ్యత: మోత్కుపల్లి సంచలనం

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌పై మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు మరోసారి స్పందించారు. రాజమండ్రి జైలులో చంద్రబాబుకుఏదైనా జరిగితే ఏపీ సీఎం జగన్‌దే బాధ్యత అని అన్నారు.

Motkupalli narasimhulu sensational comments on YS Jagan ksm
Author
First Published Oct 21, 2023, 2:12 PM IST

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌పై మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు మరోసారి స్పందించారు. రాజమండ్రి జైలులో చంద్రబాబుకుఏదైనా జరిగితే ఏపీ సీఎం జగన్‌దే బాధ్యత అని అన్నారు. మోత్కుపల్లి నర్సింహులు చేతిలో పురుగుల మందు డబ్బాతో ఎన్టీఆర్ ఘాట్‌ వద్దకు వచ్చారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ.. మూడు పార్టీలు(వైసీపీ, బీజేపీ, బీఆర్ఎస్) కలిసి కుట్ర చేసి చంద్రబాబును చంపాలని చూస్తున్నారని ఆరోపించారు. రాజమండ్రి జైలులో చంద్రబాబును హింసించి బాధపెడుతున్నారని అన్నారు.

ఏపీలో పేద ప్రజలకు బతికే పరిస్థితి లేకుండా చేశారని విమర్వించారు. జైలులో నుంచి చంద్రబాబును బయటకు రాకుండా చూసి ఓట్లను గుద్దుకోవాలని ప్రయత్నమా? అని మోత్కుపల్లి ప్రశ్నించారు. ఇదంతా డబ్బులిచ్చి మళ్లీ గెలవాలనే జగన్ ప్రయత్నం మాదిరిగా కనిపిస్తోందన్నారు. చంద్రబాబు ఆరోగ్యాన్ని దెబ్బతీసి చంపాలని చూస్తున్నారని ఆరోపించారు. రాజధాని లేని రాష్ట్రాన్ని పాలిస్తున్న ఏకైక సీఎం జగన్ అని సెటైర్లు వేశారు. చంద్రబాబు కుటుంబానికి భద్రత లేదన్నారు.

తెలంగాణలో దళిత బంధు సక్రమంగా అమలు కావడం  లేదన్నారు. ఎంతో మంది చెప్పిన వినిపించకుండా కేసీఆర్‌తో కలిసి వెళ్లానని.. ఇప్పుడు తన వర్గం ప్రజలు దళిత బంధు సంగతి ఏమైందని అడుగుతున్నారని చెప్పారు. కేసీఆర్ మోసం చేసినందున తన మాటకు కట్టుబడి ఉన్నానని తెలిపారు. కేసీఆర్ ముహుర్తం చెబితే పురుగుల మందు తాగుతానని అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios