అల్లారుముద్దుగా కనీ పెంచిన.. కన్నబిడ్డలు చూడం పొమ్మంటూ.. గెంటివేస్తే ఆ తల్లి తట్టుకోలేకపోయింది. వారి నిరాదరణతో ఆ తల్లి ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించింది. కాలిన గాయాలతో ఆస్పత్రిలో చేరి మృత్యువుతో పోరాడుతోంది.
చౌటుప్పల్ : పోషణ విషయంలో కన్నబిడ్డలే ఈసడించడం mother ప్రాణం మీదికి తెచ్చిన విషాదం ఇది. చౌటుప్పల్ inspector ఎన్.శ్రీనివాస్ కథనం ప్రకారం.. యాదాద్రి జిల్లా Choutuppal మండలం జైకేసారాం గ్రామానికి చెందిన స్వామి దంపతులకు ఇద్దరు కుమారులు నాగరాజు, రవి. పెద్ద కుమారుడు నాగరాజు రాళ్లు పగలకొట్టి జీవనం సాగిస్తున్నాడు. చిన్నవాడైన రవి లారీడ్రైవర్ గా పనిచేస్తూ వేరే ఊరిలో నివసిస్తున్నాడు. తల్లిదండ్రుల పోషణ విషయంలో వీరిద్దరూ తరచూ తగాదాలు పడేవారు.
పెద్దకుమారుడు తాగి వచ్చి ఘర్షణకు దిగేవాడు. ఒకటి రెండుసార్లు ఇంట్లో నుంచి గెంటివేశాడు. పలుమార్లు ఊర్లో పెద్దలు పంచాయతీ పెట్టి మందలించినా అతడి తీరు మారలేదు. మంగళవారం రాత్రి మరోసారి ఇలా జరగడంతో ఆవేదన చెందిన ఆండాలు బుధవారం ఉదయంఈ వేధింపులు తట్టుకోలేక పోతున్నానని… చనిపోతానని అంటూ రోడ్డుమీదకు వచ్చి ఆవేదన చెందడంతో సర్పంచు, తదితరులు నచ్చజెప్పి పోలీసులకు ఫిర్యాదు చేయమని సూచించారు. దీంతో ఆమె చౌటుప్పల్ పోలీసులను ఆశ్రయించారు.
వారు ఇద్దరు కుమారులను స్టేషన్ కు పిలిపించి విచారించారు. అప్పటి వరకు అక్కడే ఉన్న ఆండాలు (55) కుమారుల వైఖరికి మనస్థాపం చెంది ఠాణా బయట చెట్టు చాటుకు వెళ్ళి తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది. పోలీస్ అప్రమత్తమై వెంటనే మంటలు ఆర్పారు. అప్పటికే ఆమె శరీరం సగానికి పైగా కాలింది. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స చేయించారు. జూనియర్ సివిల్ న్యాయమూర్తి నాగరాజు ఆండాళుతో మాట్లాడి వాంగ్మూలాన్ని నమోదు చేశారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని ప్రైవేట్ ఆస్పత్రికి అక్కడి నుంచి గాంధీ ఆస్పత్రికి తరలించారు. భువనగిరి డిసిపి నారాయణరెడ్డి కేసు పూర్వాపరాలను అడిగి తెలుసుకున్నారు.
ఇదిలా ఉండగా, ఇలాంటి ఘటనే ఫిబ్రవరి 19న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తాడేపల్లిలో జరిగింది. నవమాసాలు మోసి కనిపెంచిన motherపై కుమారుడు కర్కశంగా వ్యవహరించాడు. గుంటూరు జిల్లాలోని తాడేపల్లి పరిధిలో బ్రహ్మానంద పురంలో చోటుచేసుకున్న ఈ దారుణం వివరాలను పోలీసులు తెలిపారు. వృద్దురాలు నాగమణి, ఆమె భర్త వెంకటేశ్వరరావుకు ఏడేళ్ల కిందట అప్పటి government land కేటాయించింది. వారు రెక్కలు ముక్కలు చేసుకుని అందులో houseని నిర్మించుకున్నారు. మూడేళ్ల కిందట కోటేశ్వర రావు చనిపోయినప్పుడు... వేరే గ్రామంలో పనిచేస్తున్న కుమారుడు శేషు.. తన భార్యతో సహా తల్లి ఇంటికి వచ్చాడు .అప్పటి నుంచి ఇక్కడే తిష్ట వేశాడు.
వృద్ధాప్యంలో తోడు ఉంటున్నాడనుకున్న తల్లి ఆనందం ఎన్నో రోజులు నిలవలేదు. ఆస్తి కోసం నిత్యం తల్లిని కష్టపెట్టే వాడు. స్థానికులు శేషును మందలించినప్పటికీ ప్రవర్తనలో మార్పు రాలేదు. శుక్రవారం శేషు కాలితో తన్నుతో, కర్రతో కొడుతూ, గిన్నెతో దాడి చేస్తూ... తల్లిపై విరుచుకు పడ్డాడు. కొట్టొద్దని అతని తల్లి ఎంతగా వేడుకుంటున్నా కనికరించలేదు. దాడి దృశ్యాలను స్థానికులు వీడియో తీసి వార్డు సచివాలయ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లారు. వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో శేషుని అదుపులోకి తీసుకున్నారు. వృద్ధురాలికి కుమారుడితో పాటు కుమార్తె కూడా ఉంది.
