నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలోని  వేల్పూరు మండలంలో విషాదం చోటు చేసుకొంది. రెండేళ్ల కూతురికి నిప్పంటించి తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటనలో కూతురు మృతి చెందింది.

 నిజామాబాద్ జిల్లాలోని వేల్పూరు మండలంలోని పడగల్‌కు చెందిన మౌనికకకు మూడేళ్ల క్రితం నిజాంసాగర్ మండలం ఆరేడు గ్రామానికి చెందిన రాజుతో  వివాహం జరిగింది.  

కారణాలు ఏమిటో తెలియదు కానీ మౌనిక తన మూడేళ్ల కూతురు నిప్పంటించి ఆ తర్వాత ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే వారిని ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందింది. మౌనిక పరిస్థితి కూడ విషమంగానే ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.