ఎమ్మెల్సీ కె.యాదవరెడ్డిని తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యాకలాపాలకు పాల్పడుతున్నారని ఆయనపై ఆరోపణలు రావడంతో విచారణ చేపట్టిన పార్టీ క్రమశిక్షణా సంఘం యాదవరెడ్డిని బహిష్కరించాల్సిదిగా సిఫారసు చేయడంతో.. టీఆర్ఎస్ అధిష్టానం ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు తెలంగాణ భవన్ ప్రకటన విడుదల చేసింది.