నాకు ప్రాణహానీ వుంది.. రేవంత్ రెడ్డిని కలుస్తా : ఎమ్మెల్యేల ఎర కేసు నిందితుడు నందకుమార్ వ్యాఖ్యలు
నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం అప్పట్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితుడిగా వున్న నందకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ప్రాణహానీ వుందని, తనకు న్యాయం చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరుతానని ఆయన పేర్కొన్నారు.
నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం అప్పట్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితుడిగా వున్న నందకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ప్రాణహానీ వుందని, తనకు న్యాయం చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరుతానని ఆయన పేర్కొన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తనను కావాలని ఇరికించారని, తద్వారా తన వ్యాపారాన్ని దెబ్బతీశారని నందకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.
తనకు సింహయాజులును బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ పరిచయం చేశారని, ఆ రోజు ఫాంహౌస్‌లో ఏం జరిగిందో త్వరలోనే బయటపెడతానని నందకుమార్ తెలిపారు. తనపై పోలీసులు అక్రమ కేసులు పెట్టి తీవ్రంగా వేధించారని.. డ్రగ్స్ కేసులోనూ ఇరికించాలని చూశారని ఆరోపించారు. త్వరలోనే తాను రేవంత్ రెడ్డిని, డీజీపీ రవిగుప్తాను కలుస్తానని నందకుమార్ పేర్కొన్నారు.
అసలేంటీ కేసు :
గతేడాది అక్టోబర్ 26న హైదరాబాద్ శివారులోని మొయినాబాద్ ఫాంహౌజ్‌లో బీఆర్ఎస్‌కు చెందిన నలుగురు ఎమ్మెల్యేల వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బీజేపీలో చేరాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, బీరం హర్షవర్థన్ రెడ్డి, రేగా కాంతారావు, పైలట్ రోహిత్ రెడ్డిలను కొందరు ప్రలోభ పెడుతూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఈ కేసులో రామచంద్రభారతి, నందకుమార్, సింహయాజీలను అదే రోజు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు నిమిత్తం తెలంగాణ ప్రభుత్వం సిట్‌ను నియమించింది.