ఎమ్మెల్యేకు తప్పిన ముప్పు: తేనేటీగల దాడి నుండి తప్పించుకున్న రాజయ్య
మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య తృటిలో ప్రమాదం నుండి తప్పించుకున్నారు. తేనేటీగల దాడి నుండి ఆయన సురక్షితంగా బయటపడ్డారు.
వరంగల్: స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కు సోమవారంనాడు తృటిలో ప్రమాదం తప్పింది . తేనేటీగల దాడి నుండి రాజయ్య సురక్షితంగా బయటపడ్డాడు. వెంటనే తన వాహనంలో ఎమ్మెల్యే రాజయ్య ఘటన స్థలనం నుండి వెళ్లిపోయాడు.
జిల్లాలోని ఉప్పుగల్ వద్ద జరిగిన బోనాల ఉత్సవాలకు ఎమ్మెల్యే రాజయ్య ఇవాళ హాజరయ్యారు. అయితే ఈ సమయంలో దివిటీలను వెలిగించారు. ఈ ప్రాంతంలో తేనేటీగలున్నాయి. దివిటీలు వెలిగించడంతో తేనేటీగలు ఒక్కసారిగా అక్కడున్నవారిపై దాడికి దిగాయి.ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు ఎమ్మెల్యేను అప్రమత్తం చేశారు. ఎమ్మెల్యే రాజయ్య వెంటనే తన వాహనంలో అక్కడి నుండి కారులో వెళ్లిపోయారు. ఈ సమయంలో అక్కడే ఉన్న కొందరు తేనేటీగల దాడిలో స్వల్పంగా గాయపడ్డారు.