దేవరకొండ: నల్లగొండ జిల్లా దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ కు, అతని కుటుంబానికి తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన క్యాంప్ కార్యాలయంపై గురువారం పిడుగు పడింది. గురువారం సాయంత్రం తెలంగాణలోని పలు చోట్ల ఉరములు, మెరుపులతో కూడిన వర్షాలు పడ్డాయి.

పిడుగు రవీంద్ర కుమార్ కార్యాలయం పెంట్ హౌస్ ను తాకింది. అయితే, ఆ ప్రమాదం నుంచి ఎమ్మెల్యే కుటుంబం తప్పించుకుంది. ఈ రోజు, రేపు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. 

హైదరాబాదులో భారీ వర్షాలు పడ్డాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడ్డాయి. హైదరాబాదులోని మూసాపేట, కూకట్ పల్లి, నిజాంపేట ప్రాంతాల్లో వర్షాలు పడ్డాయి. అంబర్ పేట, నాంపల్లి ప్రాంతాల్లో కూడా వర్షాలు పడ్డాయి.

తెలంగాణ, రాయలసీమ మీదుగా ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది. తిరుమల తిరుపతిలో కూడా ఉరములు, మెరుపులతో కూడిన వర్షాలు పడ్డాయి.