Asianet News TeluguAsianet News Telugu

కరోనా ఉద్ధృతి: ఏపీ, తెలంగాణల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు వాయిదా.. ఈసీ ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటాలో జరగాల్సిన ఎమ్మెల్సీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. తెలంగాణలో త్వరలో ఏడుగురు ఎమ్మెల్సీల పదవీ కాలం ముగుస్తోంది. ఇందులో ఆరుగురి పదవీ కాలం వచ్చే నెల జూన్ 3న పూర్తవుతోంది.

mla quota mlc elections notification postponed in telugu states due to corona ksp
Author
New Delhi, First Published May 13, 2021, 4:15 PM IST

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటాలో జరగాల్సిన ఎమ్మెల్సీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. తెలంగాణలో త్వరలో ఏడుగురు ఎమ్మెల్సీల పదవీ కాలం ముగుస్తోంది. ఇందులో ఆరుగురి పదవీ కాలం వచ్చే నెల జూన్ 3న పూర్తవుతోంది.

గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవీ కాలం కూడా అదే నెలలో 16తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఖాళీ అవుతున్న స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం వచ్చే వారమే నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉంది.

Also Read:ఇండియాలో కరోనా జోరు: మొత్తం 23,703,665కి చేరిక

వచ్చే నెల గడువు ముగుస్తున్న ఎమ్మెల్సీల్లో శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిఫ్యూటీ ఛైర్మన్ నేతి విద్యాసాగర్, కడియం శ్రీహరి, ఫరీదుద్దీన్, ఆకుల లలిత, బోడకుంటి వెంకటేశ్వర్లు ఉన్నారు. ఇక, గవర్నర్ కోటాలో ఖాళీ అవుతున్న మరో ఎమ్మెల్సీ ప్రొఫెసర్ శ్రీనివాస్ రెడ్డి.

అటు ఏపీలో మే 31తో ముగ్గురు ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనుంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఎన్నికలు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది ఈసీ. 

Follow Us:
Download App:
  • android
  • ios