Asianet News TeluguAsianet News Telugu

కాంగ్రెస్ తో అమితుమీకి కోమటిరెడ్డి సై: సాయంత్రం కీలక ప్రకటన

కాంగ్రెస్ పార్టీలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎపిసోడ్ కు ముగింపు పలకబోతుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. గురువారం సాయంత్రం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక ప్రకటన చేస్తారని అది కాంగ్రెస్ పార్టీతో ఉండేదా లేక బీజేపీలో చేరడమా రెండింటిలో ఏదో ఒక నిర్ణయం అయితే పక్కా అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. 

mla komatireddy rajagopal reddy Goodbye to the Congress party
Author
Hyderabad, First Published Jun 20, 2019, 9:30 AM IST

హైదరాబాద్: నల్గొండ జిల్లా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవలే కాంగ్రెస్ పార్టీ అధిష్టానంపై కోమటిరెడ్డి రాజగోపాల్ చేసిన వ్యాఖ్యలపై హై కమాండ్ సీరియస్ అయ్యింది. 

ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. షోకాజ్ నోటీసులు జారీ చేసిన అధిష్టానం 10 రోజుల్లో వివరణ ఇవ్వాలని కోరింది. కాంగ్రెస్ హైకమాండ్ షోకాజ్ నోటీసులు జారీ చేయడంపై ఆగ్రహంగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. 

పారట్ీలో వాస్తవాలు మాట్లాడితే షోకాజ్ నోటీసులు జారీ చేస్తారా అంటూ సన్నిహితుల వద్ద వాపోయినట్లు తెలుస్తోంది. గతంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉందో కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచించుకోవాలని సూచించినట్లు సమాచారం. 

కాంగ్రెస్ పార్టీతో అమితుమీ తేల్చుకునేందుకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రెడీ అయ్యారని తెలుస్తోంది. గురువారం బీజేపీ కీలక నేతలతో చర్చించి బీజేపీలో చేరే అంశంపై ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. 

అలాగే సాయంత్రం 4 గంటలకు తన నియోజకవర్గంలో పార్టీకార్యకర్తలతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమావేశం కానున్నారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలు, షోకాజ్ నోటీసులు జారీ వంటి అంశాలపై చర్చించనున్నారు. అలాగే బీజేపీలో చేరే అంశంపై కూడా చర్చించి ఒక ఫైనల్ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. 

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారితే కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేతలను సైతం తనతోపాటే తీసుకెళ్తారని ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో గుబులు రేపుతోంది. ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డితో టచ్ లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. 

ఇటీవలే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ హై కమాండ్, రాష్ట్ర నాయకత్వంపై కీలక వ్యాఖ్యలు చేశరాు. తెలంగాణలో టీఆర్ఎస్‌కి బీజేపీయే ప్రత్యామ్నాయం అంటూ చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పట్లో కోలుకునే పరిస్థితి లేదని తెలంగాణలో పార్టీకి భవిష్యత్ లేదని కూడా స్పష్టం చేశారు. 

కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్లే పార్టీకి ఈ పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. తెలంగాణలో టీడీపీతో పొత్తుపెట్టుకొని కొంప ముంచారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 12 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లోకి వెళ్లే రాష్ట్ర నాయకత్వం స్పందించలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 

సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ ఏఐసీసీ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామాకు సిద్ధపడ్డారని కానీ రాష్ట్రంలో ఉత్తమ్ మాత్రం అలా చేయలేదన్నారు. తనకు పీసీసీ చీఫ్ ఇచ్చి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదన్నారు రాజగోపాల్ రెడ్డి.   

మెుత్తానికి కాంగ్రెస్ పార్టీలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎపిసోడ్ కు ముగింపు పలకబోతుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. గురువారం సాయంత్రం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక ప్రకటన చేస్తారని అది కాంగ్రెస్ పార్టీతో ఉండేదా లేక బీజేపీలో చేరడమా రెండింటిలో ఏదో ఒక నిర్ణయం అయితే పక్కా అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios