హైదరాబాద్‌లో మహిళలు, యువతుల అదృశ్యమవుతున్న పరంపర రోజు రోజుకి మరింత ఎక్కువవుతోంది. శనివారం ఒక్క రోజే 43 మంది కనిపించకుండా పోవడం పోలీసు వర్గాలను ఉలిక్కిపడేలా చేసింది.

రాష్ట్రవ్యాప్తంగా శనివారం 82 మంది అదృశ్యమవ్వగా.. అందులో దాదాపు సగం భాగ్యనగరానికి చెందిన వారే. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 19 మంది, హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 14 మంది, సైబరాబాద్‌లోని  ఒక్క రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఏడుగురు మాయం కావడం సమస్య తీవ్రతను తెలియజేస్తోంది.

మాయమైన 43 మందిలో 35 మంది మహిళలు, యువతులు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఇందులో చాలా వరకు కుటుంబ కలహాలు, తల్లిదండ్రుల మందలింపులు, వివాహేతర సంబంధాలు, కిడ్నాప్‌ల నేపథ్యంలోనే ఉన్నాయి.