జూబ్లీహిల్స్ కారు ప్రమాదానికి కారణమైన మీర్జాను శుక్రవారం నాడు పోలీసులు అరెస్ట్ చేశారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 వద్ద గురువారం నాడు రాత్రి కారు ప్రమాదం జరిగింది.
హైదరాబాద్: Jubileehills కారు ప్రమాదానికి కారణమైన మీర్జాను పోలీసులు శుక్రవారం నాడు సాయంత్రం Arrest చేశారు. గురువారం నాడు రాత్రి మీర్జా కు చెందిన కారు ఢీ కొట్టడం వల్ల రెండు నెలల చిన్నారి చనిపోగా ముగ్గురు గాయపడ్డారు. ఈ ప్రమాదానికి కారణమైన Mirzaతో పాటు ఆయన కొడుకును కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
ప్రమాదానికి కారణమైన కారుకు బోధన్ ఎమ్మెల్యే షకీల్ స్టిక్కర్ ఉంది. దీంతో ఈ ప్రమాదానికి ఎమ్మెల్యే కు సంబంధించిన వారు కారణమై ఉంటారని భావించారు. అయితే ఈ ప్రమాదంపై ఎమ్మెల్యే షకీల్ శుక్రవారం నాడు స్పందించారు.
ఈ కారు తన కజిన్ మీర్జాది అని ఆయన చెప్పారు. ప్రమాదం జరిగిన సమయంలో కారును మీర్జా కొడుకు నడిపిపట్టుగా చెప్పారు. ఈ కారును అప్పుడప్పుడూ తాను కూడా ఉపయోగిస్తానని అందుకే ఆ కారుకు ఎమ్మెల్యే స్టిక్కర్ ఉందని చెప్పారు. ఎమ్మెల్యే ఈ విషయమై వీడియోను మీడియాకు విడుదల చేశారు. ఆ తర్వాత జూబ్లీహిల్స్ పోలీసులు మీర్జాతో పాటు ఆయన కొడుకును అరెస్ట్ చేశారు.
ఈ ప్రమాదం జరిగిన చోట సీసీటీవీలు లేవు. దీంతో ప్రమాదానికి కారణమైన వారిని గురతించడం కష్టంగా ఉందని పోలీసులు చెప్పారు. అయితే కారు ప్రయాణం చేసిన ప్రాంతంలో ని సీసీటీవీ దృశ్యాలను కూడా పోలీసులు పరిశీలించారు. అయితే కారుకు బ్లాక్ గ్లాస్ ఉన్న కారణంగా కారులో ఎందరున్నారనే విషయమై కూడా స్పష్టత రాలేదని కూడా పోలీసులు చెప్పారు. అయితే ఈ విషయమై ఎమ్మెల్యే షకీల్ మీడియాకు వీడియో విడుదల చేసిన తర్వాత మీర్జాతో పాటు ఆయన కొడుకును పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ ప్రమాదానికి సంబంధించి పోలీసులు నిందితుల నుండి సమాచారాన్ని సేకరిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో కారు నడిపిన సమయంలో మద్యం తాగి ఉన్నారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కారు ప్రమాదానికి సంబంధించి ఇవాళ సాయంత్రం వరకు పోలీసులకు సరైన క్లూ లభ్యం కాలేదు.ఎమ్మెల్యే షకీల్ వీడియో తర్వాత పోలీసులు జూబ్లీహిల్స్ లో ఉన్న మీర్జాను అతని కొడుకును అరెస్ట్ చేశారు. అయితే ఈ ప్రాంతంలోని సీసీటీవీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
