తెలంగాణలోని సిద్ధిపేటలో ఓ ప్రేమజంట ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
సిద్దిపేట : సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం లచ్చపేటలో దారుణ ఘటన వెలుగుచూసింది. ఇంట్లో ఉరేసుకుని ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. వీరిద్దరూ మైనర్లే కావడం గమనార్హం. వీరి
వీ ఇంట్లో అంగీకరించకపోవడంతో ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. వీరి ప్రేమకు ఇంట్లో అంగీకరించకపోవడంతో అబ్బాయి ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
కూరపాటి భగీరథ (17), తోట్ల నేహా (16)లు లచ్చపేట గ్రామానికి చెందినవారు. వీరిద్దరూ దుబ్బాకలో ఇంటర్ చదువుతున్నారు. కొన్నేళ్లుగా ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. అయితే, ఈ విషయం ఇంట్లో తెలిస్తే.. ఒప్పుకోరని, విడదీస్తారని భయపడ్డారు. ఆ భయంతోనే ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో అబ్బాయి ఇంట్లో ఇద్దరూ చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.
వీరి మృతి సంగతి తెలిసి ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. క్షణికావేశంలో మైనర్ ప్రేమికులు తీసుకున్న నిర్ణయంతో తల్లితండ్రులు, బంధువుల కన్నీటి పర్యంతం అవుతున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దుబ్బాక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
