surgical strikeపై తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ మాటలు బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) అన్నారు.

surgical strikeపై తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ మాటలు బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) అన్నారు. కేసీఆర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టుగా చెప్పారు. పుల్వామా ఉగ్రదాడి జరిగి నేటితో మూడేళ్లు పూర్తవుతున్న సందర్బంగా ముఖ్యమంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆవేదనను, బాధ్యతారాహిత్యాన్ని, అజ్ఞానాన్ని తెలియజేస్తోందన్నారు. అభినందన్ వర్తమాన్ వీరత్వం ఫ్రూప్ కాదా అంటూ ప్రశ్నించారు. సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత 6 నెలల పాటు పాకిస్తాన్‌ నో ప్లై జోన్ ప్రకటించుకుందన్నారు. ఈ ఆధారాలు కేసీఆర్‌కు పరిపోవా అని ప్రశ్నించారు. 

భారత సాయుధ బలగాలు సరిహద్దుల వెంబడి శత్రువులపై ధైర్యంగా పోరాడుతున్నాయని చెప్పారు. మనల్ని రక్షించేందుకు తెలుగు బిడ్డలు కల్నల్ సంతోష్ బాబు వంటి వారు ప్రాణత్యాగం చేస్తున్నారని తెలిపారు. దేశ రక్షణ కోసం పోరాడుతూ అమరులైన వారిని అవమానించవద్దని కోరారు.

దేశ సైన్యాన్ని అవమానించారు.. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్
సర్జికల్ స్ట్రైక్స్‌కు ఆధారాలు అడగటం ద్వారా కేసీఆర్ దేశ సైన్యాన్ని అవమానించారని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ (Anurag Thakur) అన్నారు. పాకిస్తాన్ సహా ప్రపంచ దేశాలు అన్ని అంగీకరించిన సర్జికల్ స్ట్రైక్స్‌పై అనుమానాలుకు ఎందుకని ప్రశ్నించారు. పాకిస్తాన్‌పైనే కేసీఆర్, కాంగ్రెస్‌లకు భరోసా ఉన్నట్టుగా కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. భారత సైనికుల వీరత్వాన్ని ప్రశ్నించేలా కేసీఆర్ మాట్లాడడం శోచనీయమన్నారు. 

సర్జికల్ స్ట్రైక్స్ పై కాంగ్రెస్, టీఆర్ఎస్ ఒకే పాట పాడుతున్నాయని.. పాకిస్తాన్ మాదిరి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. హిజాబ్ కావచ్చు.. సర్జికల్ స్ట్రైక్ కావచ్చు.. అభివృద్ధికి సంబంధించినంతవరకు వారు బీజేపీతో పోటీ పడలేరని అన్నారు. సర్జికల్‌ స్ట్రైక్‌ను ప్రశ్నించడం కేసీఆర్‌ మనస్తత్వాన్ని తెలియజేస్తోందని విమర్శించారు. హుజూరాబాద్‌లో టీఆర్‌ఎస్ ఓటమి తర్వాత కేసీఆర్‌లో వణుకు మొదలయ్యిందన్నారు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్. తెలంగాణలో కేసీఆర్ పతనం ప్రారంభమైందన్నారు. 

Scroll to load tweet…

సీఎం కేసీఆర్ మాట్లాడిన మాటలు.. సర్జికల్ స్ట్రైక్స్‌లో పొల్గొన్న వీర జవాన్లను అవమానించడమేనని కేంద్ర మంత్రి మురళీధరన్ (Muraleedharan) ట్వీట్ చేశారు. ‘ఇంత అవమానం! సర్జికల్ స్ట్రైక్స్‌లో సాయుధ బలగాలపై తెలంగాణ సీఎం కేసీఆర్ అనుమానాలు లేవనెత్తారు. ఇది ఆపరేషన్‌లో పాల్గొన్న మన వీర జవాన్లను అవమానించడమే’ అని మురళీధరన్ ట్వీట్ చేశారు. కేసీఆర్ చేసిన కామెంట్స్ వీడియోను కూడా పోస్టు చేశారు.