హైదరాబాద్: తనను ఓడించేందుకు కుట్రలు చేసిన చంద్రబాబుపై కచ్చితంగా ప్రతీకారం తీర్చుకొంటానని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. ఏపీలో తాను భవిష్యత్తులో కూడ పర్యటించనున్నట్టు ఆయన తేల్చి చెప్పారు.

ఏపీకి చెందిన టీడీపీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు బుధవారం నాడు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో భేటీ అయ్యారు. కొంతకాలంగా ఆయన వైసీపీలో చేరుతారనే ప్రచారం సాగుతున్న తరుణంలో ఈ భేటీకి రాజకీయంగా ప్రాధాన్యత ఏర్పడింది.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.  ఏపీ రాష్ట్రంలో తనకు బంధువులు, స్నేహితులు, ఆత్మీయులు ఉన్నారని తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. తాను ఏపీ రాష్ట్రంలో పర్యటిస్తే చంద్రబాబుకు ఎందుకు భయం పట్టుకొందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. 

హైద్రాబాద్‌లో ఆస్తులున్న ఎమ్మెల్యేలను, ఎంపీలను వైసీపీలో చేర్పించేందుకు టీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తోందని టీడీపీ  చేస్తున్న ప్రచారాన్ని ఆయన తప్పుబట్టారు. చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకొదందని ఆయన విమర్శించారు.