బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ చేరుకున్న ప్రధాని మోదీకి బేగంపేట ఎయిర్‌పోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని స్వాగతం పలికారు. అనంతరం ఎయిర్‌పోర్టు నుంచి బయటకు వచ్చిన మంత్రి తలసాని మీడియాతో మాట్లాడారు. మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకునే ధోరణిని బట్టి ఉంటుందన్నారు.
ప్రోటోకాల్ ప్రకారం సీఎం తప్పనిసరిగా ప్రధానిని రిసీవ్ చేసుకోవాలని ఎక్కడ లేదని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ చేరుకున్న ప్రధాని మోదీకి బేగంపేట ఎయిర్‌పోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని స్వాగతం పలికారు. అనంతరం ఎయిర్‌పోర్టు నుంచి బయటకు వచ్చిన మంత్రి తలసాని మీడియాతో మాట్లాడారు. మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకునే ధోరణిని బట్టి ఉంటుందన్నారు. ప్రోటోకాల్ ప్రకారం సీఎం తప్పనిసరిగా ప్రధానిని రిసీవ్ చేసుకోవాలని లేదన్నారు. రాష్ట్రానికి సంబంధించిన ప్రతినిధిగా కేబినెట్‌లో ఉన్న వ్యక్తి రిసీవ్ చేసుకోవచ్చని చెప్పారు.
భారత్ బయోటెక్‌కు వచ్చినప్పుడు మోదీకి ప్రోటోకాల్ అవసరం లేదని విమర్శించారు. అంతకుముందు ప్రధాని మోదీ తెలంగాణకు వచ్చిన సందర్భాల్లో సీఎం కేసీఆర్ రిసీవ్ చేసుకున్నారని గుర్తుచేశారు. అప్పటి నుంచే ఇదంతా మొదలైందని అన్నారు. అందుకే ఇక్కడ తప్పుబట్టడానికి ఏం లేదన్నారు. భారత రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా ఉన్నారని.. ఆయనకు టీఆర్ఎస్ మద్దతిస్తుందని చెప్పారు. ఆయన జూలై 2వ తేదీన హైదరాబాద్‌కు వస్తానని సీఎం కేసీఆర్‌కు చెప్పడంతో ఆయనను రిసీవ్ చేసుకోవడం జరిగిందన్నారు.
బీజేపీ వాళ్లు సీఎం కేసీఆర్ మీద వాళ్ల పార్టీ ఆఫీసులో ఓ క్యాప్షన్ పెట్టడం జరిగిందన్నారు. ఆ తర్వాత బై బై మోదీ తెరమీదకు వచ్చిందన్నారు. బీజేపీ నేతలను ఉద్దేశించి హైదరాబాద్‌కు టూరిస్ట్‌లు వచ్చారని ఎద్దేవా చేశారు. వారు హైదరాబాద్ అందాలు, అభివృద్ది చూసి నేర్చుకోవాలని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
రాష్ట్రంలోని బీజేపీ నేతలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారు ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వారికి హైదరాబాద్‌లో నేడు చిన్న శాంపిల్ చూపెట్టామని అన్నారు. ఇది హైదరాబాద్‌లోని జస్ట్ నాలుగైదు నియోజకవర్గాల శాంపిల్ మాత్రమేనని అన్నారు. నరేంద్ర మోదీ పాలన ఎప్పుడు ముగస్తుందని ప్రజలు, రాజకీయ పక్షాలు ఎదురుచూస్తున్నారని అన్నారు. అభివృద్ది, సంక్షేమం కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని తెలిపారు. మహారాష్ట్రలో బీజేపీ ఎం చేసిందో అందరూ చూస్తున్నాని అన్నారు. తెలంగాణలో కేసీఆర్ పాలనే శ్రీరామ రక్ష అని ప్రజలు అనుకుంటున్నారని చెప్పారు. తాము బీజేపీకి భయపడేది లేదని చెప్పారు.
