అపస్మారక స్థితిలో పడి ఉన్న వైద్యుడి పట్ల మంత్రి సత్యవతి రాథోడ్ ఉదారత చూపించారు. వెంటనే దగ్గరుండి ఆ వైద్యుడిని ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందించారు. ఈ సంఘటన మంగళవారం చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

మహబూబాబాద్ నుంచి హైదరాబాద్ కు రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ – శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ వస్తుండగా, మహబూబాబాద్ జిల్లా, ఆలేరు దగ్గర బంజారా గ్రామానికి సమీపంలో రోడ్డు మీద రాత్రి 7 గంటలకు ఒక ఆర్.ఎం.పి డాక్టర్ కింద పడిపోయి అపస్మారక స్థితిలో కనిపించారు. 

కింద పడడంతో ఆయన తలకు దెబ్బతగిలింది.  దీనిని గమనించిన వెంటనే మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు తన కాన్వాయిని ఆపి ఆ ఆర్.ఎం.పి డాక్టర్ ని తన పైలట్ వాహనంలో తన భద్రతా విభాగంలోని ఒక అధికారిని ఇచ్చి హాస్పిటల్ కు పంపించారు. కాగా.. మంత్రి సదరు డాక్టర్ పట్ల చూపించిన ఉదారత పట్ల సర్వత్రా ప్రశంసలు వెల్లువిరిస్తున్నాయి.

నాకు ఎందుకులే అని వదిలేయకుండా.. జాగ్రత్తగా ఆస్పత్రికి తరలించారంటూ మంత్రి పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.