హైదరాబాద్: తెలంగాణ మంత్రి మల్లారెడ్డికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో  అసభ్యకరంగా పోస్టు చేస్తున్న విషయమై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో మంత్రి మల్లారెడ్డిని ట్రోల్ కొంత కాలంగా ట్రోల్ చేస్తున్నారు.ఈ విషయమై మంత్రి ఓఎస్డీ శ్రీనివాస్ రెడ్డి  పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ట్రోల్ చేస్తున్న వ్యక్తుల కంప్యూటర్ ఐటీ అడ్రస్‌లను పోలీసులు గుర్తించారు. నిందితులను అరెస్ట్ చేయనున్నారు.