తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ మరోసారి సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. ఆ పార్టీ నాయకులందరు బంఫర్ మెజారిటీలతో గెలిచారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రులపై కూడా టీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందారు. ఇక టీఆర్ఎస్ ప్రముఖులు కేసీఆర్, హరిష్, కేటీఆర్ లు భారీ మెజారిటీలతో విజయం సాధించారు. 

ఈ సందర్భంగా తన గెలుపుపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. తన ఫైనల్ మెజారిటీ 88,885 ఓట్లుగా పేర్కొన్న ఆయన...ఇంత భారి మెజారిటీతో  సిరిసిల్ల తనకు అందించిందన్నారు. ఇదే ఇప్పటివరకు తన అత్యుత్తమ  మెజారిటీ. తనను గెలిపించిన ప్రజల కోసం శక్తి వంచన లేకుండా పనిచేస్తానని కేటీఆర్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. 

మరో టీఆర్ఎస్ మంత్రి హరీష్ రావు భారీ విజయాన్ని సాధించారు.  సిద్ధిపేట నియోజకవర్గంలో పోలైన ఓట్లలో 80శాతం ఓట్లను హరీష్ సాధించారు. ఇలా లక్షా 20వేల 650 ఓట్ల మెజారిటీతో ఆయన గెలుపొందారు. ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా గజ్వెల్ నుండి దాదాపు 50 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.