Asianet News TeluguAsianet News Telugu

నేనూ ఇక్కడే చదువుకున్నా.. సిరిసిల్ల పర్యటనలో కేటీఆర్..

రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖా మంత్రి కేటీఆర్‌ సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. ఇందులో భాగంగా కేటీఆర్ జెడ్పీ పాఠశాల, రైతు వేదిక భవనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...1960 సం.లో నెలకొల్పిన  గొప్ప జిల్లా పరిషత్ పాఠశాల అని ఇక్కడ చదువుకున్న వారు ఎందరో గొప్ప వారయ్యారని చెప్పుకొచ్చారు. 
 
minister ktr tour in rajanna siricilla district - bsb
Author
Hyderabad, First Published Feb 1, 2021, 2:53 PM IST

రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖా మంత్రి కేటీఆర్‌ సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. ఇందులో భాగంగా కేటీఆర్ జెడ్పీ పాఠశాల, రైతు వేదిక భవనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...1960 సం.లో నెలకొల్పిన  గొప్ప జిల్లా పరిషత్ పాఠశాల అని ఇక్కడ చదువుకున్న వారు ఎందరో గొప్ప వారయ్యారని చెప్పుకొచ్చారు. 

ఈ పాఠశాల నిర్మాణం ఎంతో గొప్పగా ఉందన్నారు. ఇక్కడ చదువుకునే  పిల్లల కోసం, విద్యార్థుల కోసం ఏం చేసినా తక్కువే అన్నారు. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా సిరిసిల్ల పాఠశాల తయారు చేశారని కొనియాడారు. 

గడిచిన 6 సం.లలో తెలంగాణ వ్యాప్తంగా 945 గురుకుల పాఠశాలలు నెలకొల్పామని, ఒక్కో విద్యార్థి మీద రూ. 1 లక్ష 20 ఖర్చు చేస్తున్న ఒకే ఒక్క ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అన్నారు. 

మన పిల్లలకు సరైన విద్య అందిస్తే, అంత కన్నా గొప్ప విషయం మరొకటి ఉండదన్నారు. చింతమడకలో ప్రభుత్వ పాఠశాలలోనే తన విద్యాభ్యాసం మొదలయ్యిందని ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తు చేసుకున్నారు. 

గురుకుల పాఠశాల్లలో సన్న బియ్యంతో విద్యార్థులకు అన్నం పెడుతున్నామని, ఫీజు రియంబర్స్ మెంట్ ద్వార విద్యార్థులకు సహాయం అందిస్తున్నామని, విదేశాల్లో చదువుకునే వారికి అండగా తెలంగాణ ప్రభుత్వం ఉందని తెలిపారు. 

ఉద్యోగం కోసం చదువు కాదు, పది మందికి ఉద్యోగం కల్పించే స్థాయికి విద్యార్థులు ఎదగాలని పిలుపునిచ్చారు. పిల్లలకు చదువుతో పాటు మానసిక ఉల్లాసం ఉండాలి, అందుకే క్రీడాలను ఎంకరేజ్ చేయాలన్నారు. 

స్కూల్ ఎలా కట్టామో, మెయింటెన్స్ అలాగే ఉండాలని అన్నారు. సిరిసిల్ల లో నూతన పాఠశాల ప్రారంభం, తెలంగాణ లో ప్రతి పల్లెల్లో కావాలి, ఆ దిశగా ప్రయత్నం చేద్దాం అన్నారు. 
 
Follow Us:
Download App:
  • android
  • ios