Asianet News TeluguAsianet News Telugu

#GiftASmile: కేటీఆర్ ఉదారత... తన పుట్టినరోజున దివ్యాంగులకు అదిరిపోయే గిప్ట్

తన పుట్టినరోజు సందర్భంగా దివ్యాంగులకు సాయం చేయడానికి ముందుకు వచ్చారు సీఎం కేసీఆర్ తనయుడు, మంత్రి కేటీఆర్. తన వంతు సాయంగా వందమంది దివ్యాంగులకు ద్విచక్ర వాహనాలు అందించనున్నట్లు మంత్రి ప్రకటించారు. 

Minister KTR to distribute bikes to disabled persons in his birthday akp
Author
Hyderabad, First Published Jul 22, 2021, 1:44 PM IST

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ మ‌రోసారి త‌న ఉదార స్వభావాన్ని చాటుకున్నారు. ఆప‌ద‌లో ఉన్న‌వారిని ఆపద్భాంద‌వుడిలా ఆదుకుంటూ.. ఎంతో మందికి అండ‌గా నిలుస్తున్న కేటీఆర్ ఇప్పుడు విక‌లాంగులకు అండ‌గా నిలిచారు.  త‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ కార్య‌క్ర‌మంలో భాగంగా.. వంద మంది దివ్యాంగుల‌కు మూడు చ‌క్రాల ద్విచ‌క్ర వాహ‌నాల‌ను అందించ‌నున్న‌ట్లు కేటీఆర్ ట్వీట్ చేశారు. 

''గ‌తేడాది నా బ‌ర్త్‌డే సంద‌ర్భంగా నా సొంత ఖ‌ర్చుల‌తో 6 అంబులెన్స్‌ల‌ను అందించారు. ఇదే స్ఫూర్తితో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు మరో 84 అంబులెన్స్ లు అందించారు. ఇలా నా పుట్టినరోజులన మొత్తం 90 అంబులెన్స్‌ల‌ను అంద‌జేశాం'' అని  ట్వీట్ లో పేర్కొన్నారు.

read more  తన పేరుతో వరి పైరు... యువ రైతుకు కేటీఆర్ కృతజ్ఞతలు

''ఈ ఏడాది కూడా నా పుట్టినరోజున గిఫ్ట్ ఎ స్మైల్ ద్వారా వంద మంది దివ్యాంగులకు ప్రత్యేకంగా తయారుచేసిన వాహనాలను బహుమతిగా ఇవ్వనున్నా. ఇలా నా పుట్టిన రోజు వేడుక జరుపుకోవడం చాలా ఆనందాన్నిస్తోంది'' అని కేటీఆర్ ప్రకటించారు. 

ఇక తన బ‌ర్త్‌డే సంద‌ర్భంగా రాష్ట్రవ్యాప్తంగా మొక్కలు నాటే ముక్కోటి వృక్షార్చ‌న‌ కార్యక్రమంలో పాల్గొనాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఇంకా పెద్దగా ఏదయినా చేయాలనిపిస్తే గిప్ట్ ఏ స్మైల్ కార్య‌క్ర‌మంలో భాగంగా సొంతంగా ఎవ‌రికైనా స‌హాయం చేయాల‌ని తన అభిమానులు, టీఆర్ఎస్ శ్రేణులకు మంత్రి సూచించారు.  పుష్ప‌గుచ్ఛాలు, కేకులు, హోర్డింగ్‌ల‌పై ఖ‌ర్చు పెట్టొద్ద‌ని కేటీఆర్ కోరారు. 

ఇక కేటీఆర్ ట్వీట్ కు స్పంచించిన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా కేటీఆర్‌ మంచి నిర్ణ‌యం తీసుకున్నారని అన్నారు. ఆయన తీసుకున్న నిర్ణ‌యం ఆపదలో ఉన్న ఎంతో మందికి ఉపయోగకరంగా ఉంటుందన్నారు. త‌మ‌కు ప్రేర‌ణ‌గా నిలిచే నాయ‌కుడి అడుగుజాడ‌ల్లో న‌డ‌వ‌డం గ‌ర్వంగా ఉంద‌ంటూ కేటీఆర్ ట్వీట్ పై స్పందించారు. కేటీఆర్ పిలుపుమేరకు ఆయన బ‌ర్త్‌డే సంద‌ర్భంగా తాను కూడా 50 బైక్‌ల‌ను విరాళంగా ఇస్తాన‌ని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్  ట్విట్టర్ ద్వారా ప్ర‌క‌టించారు.

Follow Us:
Download App:
  • android
  • ios