హైదరాబాద్: తెలంగాణ నూతన రాష్ట్రంగా ఏర్పడి టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో నిరుద్యోగ భృతి ఎంతమందికి ఇచ్చారో, ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారో తేల్చుకొనేందుకు ఓయూలో బహిరంగ చర్చకు రావాలని బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్ది రామచందర్ రావు మంత్రి కేటీఆర్ ను సవాల్ విసిరిన విషయం తెలిసిందే. ఈ సవాల్ పై మంత్రి కేటీఆర్ స్పందిస్తూ ఘాటు రిప్లై ఇచ్చారు. 

''ఎన్నికల సమయంలో గౌరవనీయులైన దేశ ప్రధాని మోదీగారు ఏడాదికి 2కోట్ల ఉద్యోగాలు ఇస్తానని హామీ ఇచ్చారు. అంటే ఆరేళ్లలో 12 కోట్ల ఉద్యోగాలివ్వాలి.  అలాగే ప్రతి జన్ ధన్ బ్యాంక్ అకౌంట్లలో రూ.15లక్షలు జమచేస్తామని హామీ ఇచ్చారు.  వాటికి సంబంధించిన సమాచారాన్ని సేకరించడంలో బిజీగా వున్నాను.  ఎన్డీఏ అంటే నో డాటా ఎవాలేబుల్ అని సమాధానం వచ్చింది.  వీటికి సంబంధించి మీ దగ్గర ఏమయినా సమాధానం వుంటే దయచేసి పంపండి'' అంటూ రామచంద్రారావు ట్వీట్ కు అదే ట్విట్టర్ వేదికన జవాభిచ్చారు కేటీఆర్. 

 

నిన్న(ఆదివారం) చేసిన సవాల్ ప్రకారం ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కాలేజీ వద్దకు చేరుకున్నారు ఎమ్మెల్సీ రామచంద్రారావు. అక్కడినుండి మరోసారి మంత్రి కేటీఆర్ బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఈ మేరకు ట్వీట్ చేయగా కేటీఆర్ కౌంటరిచ్చారు. 

తనపై కేటీఆర్ దుష్ప్రచారం చేశారని రామచంద్రారావు ఆరోపించారు. లాయర్లకు వందకోట్లు ఇప్పించినట్టుగా చెప్పారు. ఇల్ల స్థలాలు వచ్చేలా చేసింది తానేనని ఆయన గుర్తు చేశారు. న్యాయవాదులకు రాంచందర్ రావు ఏం చేసారో లాయర్లకు తెలుసునన్నారు. 

ఐటీఐఆర్ విషయంలో మీ అబద్ధం పార్లమెంట్ సాక్షి గా బట్టబయలు అయ్యాయన్నారు. రహదారులపై,ఏయిమ్స్ పై కేంద్రం తో మాట్లాడానని ఆయన చెప్పారు. మీ తప్పిదంతోనే రాష్ట్రం ఐటీఐఆర్ కొల్పోయిందని ఆయన టీఆర్ఎస్ సర్కార్ పై విమర్శలు గుప్పించారు.

ఎంఎంటీఎస్ నిదులు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదన్నారు. సీపీఎం క్యాండిడేట్ ను గెలిపించేందుకే పీవీ కుటుంభం సభ్యురాలిని బయటకు తీసుకుని వచ్చారని ఆయన ఆరోపించారు.  గట్టు వామనరావు హత్యతో మీకు భ్రాహ్మణ ఓట్లు పడవనే పీవీ కూతురు కు టికెట్ ఇచ్చారన్నారు. ఒక్క బ్రహ్మణ వర్గమే కాకుండా అన్నివర్గాలు తన వెంటే ఉన్నాయన్నారు.