తెలంగాణ ఎన్నికలకు మరో వారం రోజుల సమయం మాత్రమే ఉండటంతో ప్రధాన పార్టీలన్ని ప్రచార హోరును పెంచాయి. ఈ క్రమంలో టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన డబుల్ బెడ్ రూం ఇళ్ల హామీపై ప్రతిపక్షాలు ముఖ్యంగా విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. పేదలకు రెండు లక్షల డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టిస్తామని చెప్పిన కేసీఆర్ సర్కార్ ఆ హామీని నెరవేర్చడంలో విఫలమైందని ప్రతిపక్షాల ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రయత్నిస్తున్నాయి. ఈ విషయాన్ని గమనించిన మంత్రి కేటీఆర్ నష్టనివారణ చర్యలు చేపట్టారు.

తాను ప్రాతినిద్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహించిన కేటీఆర్...డబుల్ బెడ్‌రూం ఇళ్ల పథకంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పేదల డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం పట్ల తాను కూడా అసంతృప్తిగా ఉన్నట్లు తెలిపారు. అయితే ఇందులో ప్రభుత్వ నిర్లక్ష్యమేమీ లేదని... ఇళ్ల నిర్మాణానికి స్థలం అందుబాటులో లేకపోవడం, కాంట్రాక్టర్లు కూడా ముందుకు రాకపోవడం వల్లే ఆలస్యమవుతోందని అన్నారు.
మళ్లీ టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే డబుల్ బెడ్ రూం పథకం నిబంధనలను మాన్చనున్నట్లు కేటీఆర్ హామీ ఇచ్చారు. లబ్దిదారులకు ఎక్కడ స్థలం వుంటే అక్కడ ఇంటిని నిర్మించి ఇస్తామన్నారు. ఇప్పుడు ఇన్ని పనులు చేసిన వాళ్లం అప్పుడు మాత్రం ఆ ఒక్క హామీని వదిలేస్తామా అన్నారు. ఆడపడుచుల బాకీని తీర్చేదాక వదిలిపెట్టనని కేటీఆర్ స్పష్టం చేశారు.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Nov 30, 2018, 8:15 PM IST