Asianet News TeluguAsianet News Telugu

KTR: ఐటీ యువతి ర్యాప్ సాంగ్ కు ఫిదా అయినా మంత్రి కేటీఆర్.. నెటిజన్ల రియాక్ట్ మాత్రం వేరే లెవల్.. 

KTR: రాజకీయాల్లోనే కాకుండు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే మంత్రి కేటీఆర్ తాజాగా ఓ ఐటీ యువతి పాడిన ర్యాప్ సాంగ్ కు ఫిదా అయ్యారు. ఆ పాటకు సంబంధించిన వీడియోను మంత్రి రీ ట్వీట్ చేశారు. అయితే.. నెటిజన్ల రియాక్ట్ మాత్రం వేరే లెవల్ ఉంది. మీరు కూడా ఓ లూక్కేండి. 

Minister Ktr shares young girl rap song in Twitter video viral KRJ
Author
First Published Nov 3, 2023, 11:44 AM IST | Last Updated Nov 3, 2023, 11:44 AM IST

KTR: తెలంగాణ మంత్రి కేటీఆర్ రాజకీయాల్లోనే కాదు.. సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటారు. ప్రతి విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా షేర్ చేసుకుంటారు. ప్రభుత్వ అభివృద్ధి పనులకు గానీ, పొలిటికల్ అంశాలను గానీ, తన  వ్యక్తిగత విషయాలను కూడా ట్విట్టర్ వేదికగా పంచుకుంటాడు. చాలా మంది తమ సమస్యలను  మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లాలంటే.. డైరెక్ట్ గా కలువకుండా.. ట్విట్టర్ లో పోస్టు చేస్తారు. అలాగే.. ఏ సమస్య వస్తే.. ఆ సమస్యను పరిష్కరించాలని సంబంధింత అధికారులను ట్విట్టర్ వేదికగా కోరుతారు. ప్రతిపక్షాలు ఆయనను ట్విట్టర్ మంత్రి అని కామెంట్స్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. 

తాజాగా మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్ హ్యాండిల్ లో ఓ యువతి తనను ఆపి మరి.. హైదరాబాద్ ను ఉద్దేశించి పాడిన క్రేజీ ర్యాప్ సాంగ్‌ను ట్వీట్ చేశారు. ఆ ర్యాప్ సాంగ్ ను వింటున్న సమయంలో మంత్రి కేటీఆర్ చాలా ఎంజాయ్ చేశారు. ఆ సింగర్ ని కూడా చాలా ఎంకరేజ్ చేశారు. ఆ యువతి పాటకు ఫిదా అయిన మంత్రి  కేటీఆర్ ‘ఏంట్ దట్ స్వీట్ థ్యాంక్స్ @MirchiRJswathi’అని ఆ పాటకు సంబంధించిన వీడియోను ట్వీట్ చేశారు. 

అర్పిత అనే యువతి పాడిన ర్యాప్ సాంగ్‌లో.." హైదరాబాద్ అంటేనే హైపర్‌గా ఉంటాం.. బిర్యానీ తింటూనే ఇరానీ ఛాయ్ అంటాం.. మండే టు ఫ్రైడే ఆఫీసులకు వెళ్లి పోతాం.. మెట్రో ఎక్కి దిగేదాగా ముచ్చట్లే పెడుతాం.. ఐటీ మాదే.. ఫార్మా మాదే.. అంబేడ్కర్ విగ్రహానికి సెల్యూట్‌నే కొడతాం.. ఐటీలో అయినా .. అభివృద్ధిలో అయినా.. టాప్ మనమే.. ఫస్ట్ మనమే.. బెస్ట మనమే.. అన్నింట్లో అవార్డుల్లో మస్త్ మనమే.. బోనాల పండుగకు పునకాలు తెస్తా.. దసరా ముంగిటా బతుకమ్మ ఆడుతాం.. మనది హైద్రాబాదు.. దేశంలో మనమే జోరు.. మన కేటీఆరు.. ఇగ సూడర జోరు .. అంటూ పాడిన పాటకు నెటిజన్లు సైతం ఫిదా అవుతున్నారు. 

ఈ వీడియో చూసిన నెటిజన్లు ‘కిరాక్ ర్యాప్’ అని కామెంట్ చేయగా, మరికొందరూ బీఆర్ఎస్ పై సెటైర్లు వేస్తున్నారు. ఓ నెటిజన్ మాత్రం.. హైదరాబాద్ అంటేనే హైపర్ గా ఉంటాం...ప్రశ్నిస్తాం.. నిలదీస్తాం.. ఉద్యమం చేస్తాం.. ఉల్టా తిప్పికొడతాం.. నీ దొరతనం ఇకపై చెల్లదని.. నిన్ను తరిమి కొడతాం.. తెలంగాణ ను దోచుకున్న దొర.. నీ పనిపడతాం అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఏదిఏమైనా ఈ  ర్యాప్ కు సంబంధించిన  వీడియో మాత్రం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios