Asianet News TeluguAsianet News Telugu

బక్క పలుచని వీరుడు బందూకై తన జాతిని మేలు కొలిపిన రోజు ఇది.. మంత్రి కేటీఆర్

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో భాగంగా 13 ఏళ్ల క్రితం సరిగా ఇదే రోజు  (2009 నవంబర్ 29) కేసీఆర్ ఆమరణ దీక్షకు దిగిన సంగతి తెలిసిందే. ఆనాటి సంగతులను గుర్తు చేస్తూ తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌లో ఓ పోస్టు చేశారు.

Minister KTR says 29th Nov 2009 A memorable day in the history of Telangana
Author
First Published Nov 29, 2022, 12:00 PM IST

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో భాగంగా 13 ఏళ్ల క్రితం సరిగా ఇదే రోజు  (2009 నవంబర్ 29) కేసీఆర్ ఆమరణ దీక్షకు దిగిన సంగతి తెలిసిందే. ఆ రోజును టీఆర్ఎస్ శ్రేణులు దీక్షా దివస్‌గా పాటిస్తున్నాయి. అయితే ఆనాటి సంగతులను గుర్తు చేస్తూ తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌లో ఓ పోస్టు చేశారు. కేసీఆర్ పోరాటం అనితర సాధ్యం అని అన్నారు. దీక్షా దివస్ తెలంగాణ  చరిత్రలో చిరస్మరణీయమైన రోజు అని.. ఆ రోజు చరిత్రను మలుపు తిప్పిందని పేర్కొన్నారు. 

2009 నవంబర్ 29 ఒక నవశకానికి నాంది పలికి రోజని అన్నారు. ఒక బక్క పలుచని వీరుడు బందూకై తన జాతిని మేలు కొలిపిన రోజు.. తెలంగాణ వైపు దేశం దృష్టి మరల్చే విధంగా తెగించిన రోజు అని కేటీఆర్ ట్వీట్ చేశారు. కేసీఆర్ అమరణ దీక్ష అప్పటి ఫొటోను కూడా షేర్ చేసిన కేటీఆర్.. #DeekshaDivas హ్యాష్ ట్యాగ్‌ను జత చేశారు. 

 


ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా దీక్షా దివస్‌ను గుర్తుచేస్తూ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ‘‘కోట్లాది ప్రజల ఆకాంక్షను నెరవేర్చేందుకు,  'తెలంగాణ వచ్చుడో..కేసీఆర్ సచ్చుడో' అంటూ, ప్రాణాలను పణంగా పెట్టి, సమైక్య పాలకుల నిర్బంధాలను ఛేదించి, ‌సిద్దిపేట కేంద్రంగా ఉద్యమ వీరుడు కేసీఆర్ ఆమరణ నిరాహారదీక్ష ప్రారంభించిన చారిత్రక రోజు.. నవంబర్ 29, దీక్షా దివాస్.. ఆనాటి ఆమరణ నిరాహారదీక్ష స్పూర్తితో, స్వరాష్ట్రం తెలంగాణలో సీఎం కేసీఆర్ సారధ్యంలో, సర్కారు సంక్షేమ, అభివృద్ధి ఫలాలతో సబ్బండ వర్ణాలు సగర్వంగా,సంతోషంగా ఉన్నారు. రాష్ట్రం అన్నింటా అగ్రగామిగా నిలుస్తూ, దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది’’ అని కవిత ట్వీట్ చేశారు. కేసీఆర్ ఆమరణ దీక్షకు సంబంధించిన కొన్ని ఫొటోలను కూడా కవిత షేర్ చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios