రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్ , టీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా డ్రగ్ టెస్ట్‌కి సిద్ధమా అంటూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు హైదరాబాద్‌లో కలకలం రేపాయి. ఈ నేపథ్యంలో పొలిటికల్ టూరిస్టులు వస్తారు , వెళ్తారని.. కేసీఆర్ మాత్రం ఇక్కడే ఉంటారంటూ ట్వీట్ చేశారు రాహుల్. 

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనపై మంత్రి కేటీఆర్ సెటైర్లు వేశారు. పొలిటికల్ టూరిస్టులు వస్తారు , వెళ్తారని.. కేసీఆర్ మాత్రం ఇక్కడే ఉంటారంటూ ట్వీట్ చేశారు. దీనికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కౌంటరిచ్చారు. ‘‘ కేటీఆర్ గారూ…మీ దృష్టిలో తెలంగాణ ఒక టూరిస్ట్ ప్లేస్ అయి ఉండొచ్చు! కాంగ్రెస్ దృష్టిలో ఈ రాష్ట్రం అమరవీరుల త్యాగఫలం. నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షల ప్రతిరూపం. మీ వక్రదృష్టి ప్రకారం ఇది టూరిస్ట్ ప్లేస్ అనుకున్నా… దానిని సృష్టించింది కూడా కాంగ్రెసే’’ నంటూ రేవంత్ ట్వీట్ చేశారు. 

అంతకుముందు ఉదయం కూడా కేటీఆర్ వేసిన ప్రశ్నలకు ట్విట్టర్ వేదికగానే రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. మీ పాలనపై ఏం అధ్యయనం చేయాలని కేటీఆర్ ను ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. రుణమాఫీ హామీని ఎలా ఎగ్గొట్టాలి, ఉచిత ఎరువుల హామీని ఎలా అటకెక్కించాలనే విషయాన్ని నేర్చుకోవాలా అని అడిగారు. మోడీ ముందు మోకరిల్లి తెలంగాణ రైతులకు ఉరితాళ్లు ఎలా బిగించాలి అనే విషయం నేర్చుకోవాలా అని అడిగారు. వరి, మిర్చి, రైతులు ఎలా చనిపోతున్నారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఈ నిజాలను చెప్పేందుకే రాహుల్ గాంధీ వరంగల్ వస్తున్నారని రేవంత్ రెడ్డి చెప్పారు. 

అంతకుముందు టీఆర్ఎస్‌తో పొత్తు కోరుకునే కాంగ్రెస్ నేతలు ఎవరైనా టీఆర్ఎస్‌లోకి వెళ్లిపోవచ్చని వరంగల్‌లో ఏర్పాటు చేసిన రైతు సంఘర్షణ సభలో రాహుల్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అలాంటి నేతలు పార్టీకి అక్కర్లేదని.. ఎన్నికల్లో టీఆర్ఎస్‌ను ఓడించి తీరుతామని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. రైతుల పక్షాన పోరాడిన వారికే టికెట్లు దక్కుతాయని.. మీరెంత పెద్దనేతైనా ప్రజల పక్షాన పోరాడకపోతే టికెట్ దక్కదని రాహుల్ హెచ్చరించారు. 

తెలంగాణ ప్రజల సమస్యలపై పోరాడేందుకు తాను ఎప్పుడూ సిద్ధమేనని ఆయన స్పష్టం చేశారు. ఇది తెలంగాణ రైతుల పోరాటమే కాదని.. తమ పోరాటం కూడా అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. మోడీ రైతు చట్టాలను తెచ్చినప్పుడు టీఆర్ఎస్ ఎక్కడుందని ఆయన ప్రశ్నించారు. టీఆర్ఎస్, బీజేపీ మధ్య రహస్య ఒప్పందం వుందని రాహుల్ ఆరోపించారు. తెలంగాణలో గెలవలేం కాబట్టి బీజేపీ.. రిమోట్ కంట్రోల్‌తో పాలిస్తోందని ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణలో టీఆర్ఎస్ సర్కారే ఉండాలని బీజేపీ కోరుకుంటోందని రాహుల్ ఆరోపించారు. టీఆర్ఎస్ ఎంత దోచుకున్నా, ఈడీ లేదు, ఐటీ రాదని ఆయన దుయ్యబట్టారు. కాంగ్రెస్ విధానాలు విమర్శిస్తే సహించేది లేదని రాహుల్ గాంధీ హెచ్చరించారు. 

తెలంగాణ ఏ ఒక్కరి వల్లా రాలేదన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఒక్కరి కోసం తెలంగాణ ఏర్పడలేదన్నారు. తెలంగాణ వల్ల ఒకే ఒక కుటుంబం బాగుపడిందని.. ఈ వేదిక మీద భర్తల్ని పొగొట్టుకున్న రైతు కుటుంబాలు వున్నాయని రాహు ఆవేదన వ్యక్తం చేశారు. వీరి వేదనకు ఎవరు కారణమని ఆయన ప్రశ్నించారు. ఇటువంటి బాధిత రైతులు రాష్ట్రమంతా వున్నారని రాహుల్ అన్నారు. ఎంతోమంది త్యాగాలతో తెలంగాణ వచ్చిందని... యువతకు ఉద్యోగాలు రాలేదని చెప్పారు. తెలంగాణ కల సాకారం చేసుకోవడానికి మీరు రక్తాన్ని, కన్నీళ్లను చిందించారని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. 

Scroll to load tweet…