ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ నేతలకు క్లాస్ తీసుకున్నారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్. పలువురి ఎమ్మెల్యేల తీరు దురుసుగా వుందని.. వాళ్లు తీరు మార్చుకోవాలని సూచించారు.

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో.. పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. కొత్త, పాత తేడా లేకుండా అందరితో కలిసి పనిచేయాలన్నారు. ఎమ్మెల్యేలు ఉంటారు.. పోతారు కానీ నియోజకవర్గాల్లో పార్టీ బలంగా ఉండటం అవసరమన్నారు కేటీఆర్.

జమిలి ఎన్నికలపై ప్రచారం జరుగుతోందని.. జమిలి వచ్చినా రాకపోయినా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇదే సమయంలో అభివృద్ధి పనుల వివరాలను కేటీఆర్‌కు అందించారు ఎమ్మెల్యేలు.