Asianet News TeluguAsianet News Telugu

లోక్‌సభ డిలిమిటేషన్‌లో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం.. రాజకీయాలకు అతీతంగా గళమెత్తాలి: మంత్రి కేటీఆర్

2026 ఏడాది తర్వాత జనాభా ప్రతిపాదికన జరుగనున్న లోక్‌సభ స్థానాల డిలిమిటేషన్ తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. జనాభా ప్రతిపాదికన జరుగనున్న లోక్‌సభ స్థానాల డిలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందని అన్నారు.

minister ktr on lok sabha seat delimitation after 2026 ksm
Author
First Published May 30, 2023, 12:04 PM IST

హైదరాబాద్‌: 2026 ఏడాది తర్వాత జనాభా ప్రతిపాదికన జరుగనున్న లోక్‌సభ స్థానాల డిలిమిటేషన్ తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. జనాభా ప్రతిపాదికన జరుగనున్న లోక్‌సభ స్థానాల డిలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందని అన్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో పోస్టు చేశారు. భారతదేశంలోని దక్షిణాది రాష్ట్రాలు స్వాతంత్య్రం తర్వాత అన్ని రంగాలలో అత్యుత్తమ పనితీరు కనబరిచాయని అన్నారు. అధిక జనాభాతో సతమతమవుతున్న దేశాన్ని కాపాడుకునేందుకు.. జనాభా నియంత్రణ పద్ధతులు పాటించాలని దశాబ్దాల నుంచి కేంద్రం చెబుతున్న మాటలను దక్షిణాది రాష్ట్రాలు నమ్మాయని.. ప్రగతిశీల విధానాలతో జనాభా నియంత్రణ చేశాయని చెప్పారు. 

అయితే జనాభా ప్రతిపాదికన జరుగనున్న లోక్‌సభ స్థానాల డిలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాల తీవ్ర అన్యాయానికి లోనయ్యే అవకాశం ఉందన్నారు. ప్రగతిశీల విధానాలతో ముందుకు పోతున్న దక్షిణాది రాష్ట్రాలు ఈ నూతన డిలిమిటేషన్ వల్ల తక్కువ లోక్‌సభ స్థానాలు పొందడం అన్యాయం, బాధాకరమని అన్నారు. జనాభా నియంత్రణపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఖాతరు చేయని రాష్ట్రాలు లోక్‌సభ సీట్ల పెంపు విషయంలో లబ్ధిపొందుతున్నాయని.. ఇది దురదృష్టకరమైనమని పేర్కొన్నారు. ఈ అన్యాయానికి వ్యతిరేకంగా అన్ని దక్షిణాది రాష్ట్రాల నాయకులు, ప్రజలు రాజకీయాలకు అతీతంగా సమిష్టిగా గళమెత్తాలని పిలుపునిచ్చారు. 

 


జనాభాను నియంత్రించిన కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ  రాష్ట్రాలు తమ ప్రగతిశీల విధానాలకు తీవ్రంగా శిక్షించబడుతున్నాయని కేటీఆర్ చెప్పుకొచ్చారు. వలం జనాభా నియంత్రణ మాత్రమే కాకుండా అన్ని రకాల మానవాభివృద్ధి సూచీల్లోనూ దక్షిణాది రాష్ట్రాలు ముందు వరుసలో ఉన్నాయని చెప్పారు. కేవలం 18 శాతం జనాభా కలిగిన దక్షిణాది రాష్ట్రాలు 35 శాతం జాతీయ స్థూల జాతీయోత్పత్తికి నిధులు అందిస్తున్నాయని తెలిపారు. జాతీయ ఆర్థిక వ్యవస్థ, వృద్ధికి గర్వకారణమైన సహకారులను అణగదొక్కకూడదని కోరారు. 
 

 

Follow Us:
Download App:
  • android
  • ios