హైదరాబాద్ :  తెలంగాణ రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ శుక్రవారం నాడు ముప్పె నిమిషాల పాటు లిఫ్ట్ లోనే ఇరుక్కుపోయారు. లిఫ్ట్ లాక్ ఓపెన్ చేసి మంత్రిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు అధికారులు.

శుక్రవారం నాడు సైఫాబాద్ లోని  జరిగిన ఓ కార్యక్రమానికి మంత్రి హాజరయ్యాడు. ముప్పై నిమిషాల పాటు లిఫ్ట్ లో  మంత్రి కొప్పుల ఈశ్వర్ ఇరుక్కున్నాడు. మంత్రిని లిఫ్ట్ లో నుండి బయటకు తీసుకొచ్చేందుకు ముప్పై నిమిషాల పాటు సిబ్బంది కష్టపడ్డారు.

30 నిమిషాల తర్వాత లిఫ్ట్ లాక్ ఓపెన్ చేసి మంత్రిని సురక్షితంగా సిబ్బంది బయటకు తీసుకొచ్చారు. మంత్రిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేవరకు సిబ్బంది టెన్షన్ పడ్డారు.  లిఫ్ట్ ఎందుకు పనిచేయలేదు.. లిఫ్ట్ పనిచేయకపోవడానికి గల కారణాలను అధికారులు ఆరా తీస్తున్నారు.

మంత్రితో పాటు సిబ్బంది లిఫ్ట్ లో ఇరుక్కుపోయారు.