Asianet News TeluguAsianet News Telugu

కాంగ్రెస్ కు ప్రతిపక్ష హోదా దక్కదు: హరీష్ రావు ఫైర్

కాంగ్రెస్ పార్టీపై మంత్రి హరీష్ రావు నిప్పులు చెరిగారు. సిద్దిపేట జిల్లాలోని జగదేవ్ పూర్ మండలంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న హరీష్ రావు కాంగ్రెస్ కు ప్రతిపక్ష హోదా కూడా దక్కదని జోస్యం చెప్పారు. ఓటు అనే ఆయుధంతో కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు

Minister harishrao fires on congress
Author
Siddipet, First Published Oct 10, 2018, 4:41 PM IST

సిద్ధిపేట: కాంగ్రెస్ పార్టీపై మంత్రి హరీష్ రావు నిప్పులు చెరిగారు. సిద్దిపేట జిల్లాలోని జగదేవ్ పూర్ మండలంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న హరీష్ రావు కాంగ్రెస్ కు ప్రతిపక్ష హోదా కూడా దక్కదని జోస్యం చెప్పారు. ఓటు అనే ఆయుధంతో కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. 

జగదేవ్ పూర్ మండలంలోని జంగంరెడ్డి పల్లి, ఛాటపల్లి, తీగుల్ నర్సాపూర్ గ్రామాల్లో మంత్రి హరీష్ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మంత్రి హరీష్ రావుకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి ఆటంకం కలిగిస్తోందని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ కూడా దక్కదన్నారు. అభివృద్ధి అడ్డుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి ఓటు అడిగే హక్కు ఎక్కడదని ప్రశ్నించారు. 

రాష్ట్రంలో కేసీఆర్ పాలనపైనా, టీఆర్ఎస్ ప్రభుత్వంపైనా ప్రజలకు నమ్మకం కలిగింది అని అందుకు నిదర్శనమే జాతీయ మీడియా సర్వేలు అన్నారు. రాబోయే ఆరు నెలల్లో సాగుకు గోదావరి జలాలు తీసుకువస్తామని హామీ ఇచ్చారు. బతుకమ్మ చీరలు అడ్డుకున్న కాంగ్రెస్‌కు మహిళలు ఓటుతో బుద్ధి చెప్పాలని హరీశ్‌రావు కోరారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అది కేసీఆర్ తోనే సాధ్యమని వివరించారు. 

ఎన్నికల ప్రచారంలో మ‌హిళ‌లు బ‌తుక‌మ్మ‌లతో స్వాగతం పలికారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కే ఓటేస్తామని గ్రామస్తులంతా హరీష్ కు హామీ ఇచ్చారు. తిగుల్ నర్సాపూర్ లో ప్రసిద్ధ పుణ్య క్షేత్రం అయిన కొండ పోచమ్మ దేవాలయాన్ని దర్శించుకున్న హరీష్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

 కొండపోచమ్మ తల్లి దయ మనపై ఉందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు లో భాగంగా ఈ ప్రాంతంలో 15టీఎంసీలతో  కొండ పోచమ్మ సాగర్ నిర్మిస్తున్నట్లు తెలిపారు. కొండ పోచమ్మ సాగర్ ప్రాజెక్టు పనులు దాదాపు 90% పూర్తయ్యాయని తెలిపారు. వచ్చే ఏడాదికల్లా గోదావరి జలాలు అమ్మ చెంతకు చేరతాయని తెలిపారు. గోదావరి జలాలతో తల్లిపాదాలు కడుతామని ధీమా వ్యక్తం చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios