Asianet News TeluguAsianet News Telugu

కాశీనాథ్ సేట్ .. ఎలా ఉన్నావ్, వ్యాపారం ఎలా ఉంది: బుక్‌స్టాల్ వ్యాపారికి మంత్రి హరీశ్ సర్‌ప్రైజ్

సిద్దిపేట (siddipet) పట్టణంలోని కృష్ణా‌బుక్‌ డిపో‌ యాజమాన్యానికి మంత్రి హరీష్‌ రావు‌ సర్‌ప్రైజ్ ఇచ్చారు. శనివారం కారు ఆపిన ఆయన అకస్మాత్తుగా లోనికి వెళ్లారు. ఎం కాశీనాథ్ సేట్ ఎలా ఉన్నావ్ ... బాగున్నవా.. వ్యాపారం ఎలా నడుస్తోంది... ఆరోగ్యం బాగుందా అంటూ హరీశ్ రావు పలకరించారు.

minister harish rao surprise visit
Author
Siddipet, First Published Nov 6, 2021, 10:41 PM IST

సిద్దిపేట (siddipet) పట్టణంలోని కృష్ణా‌బుక్‌ డిపో‌ యాజమాన్యానికి మంత్రి హరీష్‌ రావు‌ సర్‌ప్రైజ్ ఇచ్చారు. శనివారం కారు ఆపిన ఆయన అకస్మాత్తుగా లోనికి వెళ్లారు. ఎం కాశీనాథ్ సేట్ ఎలా ఉన్నావ్ ... బాగున్నవా.. వ్యాపారం ఎలా నడుస్తోంది... ఆరోగ్యం బాగుందా అంటూ హరీశ్ రావు పలకరించారు. దీంతో కాశీనాథ్ దంపతులు ఆశ్చర్య పోయారు. హరిశ్ అన్న వచ్చాడంటూ వారు ఒక్కసారిగా కంగారు గురయ్యారు. లోనికి వచ్చి బుక్ స్టాల్ వ్యాపారం‌పై అరా తీశాడు. హరీశ్ రావు లాంటి వ్యక్తి బుక్‌స్టాల్‌కి రావడం .. ఆత్మీయంగా పలకరించడం పట్ల కాశీనాథ్ సేట్ దంపతుల ఆనందానికి అవధులు లేవు. సామాన్యునిగా ఒక నాయకుడు రావడం పట్ల ఆశ్ఛర్యం వ్యక్తం చేశారు.

కాగా.. హరీష్ రావు చిక్కుల్లో పడ్డారనే మాట వినిపిస్తోంది. ట్రబుల్ షూటర్ కే ట్రబుల్ ప్రారంభమవుతుందనే ఊహాగానాలు కూడా చెలరేగుతున్నాయి. హుజూరాబాద్ ఉప ఎన్నిక (huzurabad bypoll) ఫలితం ఆయనను చిక్కుల్లో పడేసే అవకాశం ఉంది. హుజూరాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను గెలిపించే బాధ్యతను కేసీఆర్ ఆయన భుజాల మీద మోపారు. అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించే సత్తా ఉన్న నేతగా Harish rao గుర్తింపు పొందారు. 

ALso Read:Huzurabad bypoll result 2021: ట్రబుల్ షూటర్ హరీష్ రావుకు ట్రబుల్

తన పాత మిత్రుడు, తాజా ప్రత్యర్థి ఈటల రాజేందర్ ను ఓడించే బాధ్యతను ఆయన తీసుకున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఆయన కాలికి బలపం కట్టుకుని తిరిగారు. కానీ, ఫలితం ఆయనకు ప్రతికూలంగా వచ్చింది. నిజానికి, హుజూరాబాద్ నియోజకవర్గంలో Eetela rajender ప్రత్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ కన్నా హరీష్ రావే అనిపించేలా ప్రచారం సాగింది. ఈటల రాజేందర్ మీద ఆయన తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. 

టీఆర్ఎస్ ప్లీనరీకి కూడా హాజరు కాకుండా హరీష్ రావు హుజురాబాద్ నియోజకవర్గంలోనే మకాం వేసి టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కోసం పనిచేశారు. ఆయనతో పాటు మంత్రులు కొప్పుల ఈశ్వర్ (koppula eshwar), గంగుల కమలాకర్ (gangula kamalakar) కూడా ఉప ఎన్నిక ప్రచారంలో నిండా మునిగిపోయి ఈటల రాజేందర్ ను ఓడించాలని ప్రయత్నించారు. పలువురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా హుజూరాబాద్ నియోజకవర్గంలో మకాం వేశారు. అయినా ఫలితం సాధించలేకపోయారు. 

Follow Us:
Download App:
  • android
  • ios