వాళ్లు తిట్లలో పోటీ.. మాది కిట్లలో పోటీ : కాంగ్రెస్‌పై హరీశ్‌రావు సెటైర్లు
కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలు గుప్పించారు మంత్రి హరీశ్ రావు. కాంగ్రెస్ పార్టీది బట్ట కాల్చీ మీద వేసే సంస్కృతి.. ప్రతిపక్షాల పాలనకు మా పాలనకు నక్కకు నాగ లోకానికి ఉన్నంత తేడా వుందన్నారు

కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలు గుప్పించారు మంత్రి హరీశ్ రావు. ఆదివారం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ఖర్గే వచ్చి తిడుతారని, వాళ్లది తిట్లలో పోటీ.. మనది కిట్లలో పోటీ అని హరీశ్ దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీది బట్ట కాల్చీ మీద వేసే సంస్కృతి.. ప్రతిపక్షాల పాలనకు మా పాలనకు నక్కకు నాగ లోకానికి ఉన్నంత తేడా వుందన్నారు. ఇదే సమయంలో సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిపైనా ఆయన మండిపడ్డారు.
ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి జగ్గారెడ్డి అందుబాటులో లేదని, ఆయన ఎక్కడున్నాడో తెలియన్నారు. నియోజకవర్గ ప్రజలకు ఫోన్ నెంబర్ తెలియని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అని హరీశ్ దుయ్యబట్టారు. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో చేసిందేమి లేదని.. కాంగ్రెస్‌వి వట్టి మాటలేని ఎద్దేవా చేశారు. కేసీఆర్ సర్కార్ చేతల ప్రభుత్వమని.. ఆయన పక్కా హిందూ అని హరీశ్ స్పష్టం చేశారు. కేసీఆర్ కుల మతాలకు అతీతంగా పనిచేశాడని, కాంగ్రెస్ నేతలు అబద్ధాలు చెబుతున్నారని దుయ్యబట్టారు.
ALso Read: తెలంగాణ ఆలోచిస్తే దేశం ఆచరిస్తోంది... ఈ ఘనత కేసీఆర్ దే..: హరీష్ రావు
నిన్న హరీశ్ రావు మాట్లాడుతూ.. తెలంగాణలో ఒకేసారి తొమ్మిది ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రారంభించడం దేశ వైద్య చరిత్రలోనే తొలిసారని అన్నారు. ఇంతవరకు ఏ రాష్ట్రంలోనూ ఇలా ఒకేసారి తొమ్మిది ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రారంభించిన దాఖలాలు లేవన్నారు. గతేడాది తెలంగాణలో ఒకేసారి 8 మెడికల్ కాలేజీలు ఏర్పాటే రికార్డ్... ఇప్పుడు ఆ రికార్డ్ ను బద్దలుగొట్టామని అన్నారు. మన రికార్డును మనమే అధిగమించామని హరీష్ రావు అన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టుదలకు నిదర్శనమే రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ఏర్పాటని అన్నారు. పేద, మద్యతరగతి వర్గాల విద్యార్థులకు ఉన్నత చదువుల అందించడం... అదే వర్గాలకు మెరుగైన వైద్యం అందించాలనే కేసీఆర్ సర్కార్ భారీగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటుచేస్తోందని అన్నారు. దీంతో తెలంగాణ వైద్యరంగం దేశానికే ఆదర్శంగా నిలిచిందని... ఇంతటి విజయం సీఎం మార్గనిర్దేశంతోనే సాధ్యమయ్యిందని హరీష్ అన్నారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా అందుబాటులో వున్నా ఎంబిబిఎస్ సీట్లలో కేవలం తెలంగాణ వాటానే 43 శాతమని మంత్రి తెలిపారు. దేశంలోని మిగతా 27 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో అందుబాటులో వున్న ఎంబిబిఎస్ సీట్లు 57శాతం అని అన్నారు. ఇది తెలంగాణ ప్రగతికి నిదర్శనమని అన్నారు.